తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఈసారి మూడు ప్రధాన పార్టీల మద్య పోటీ రసవత్తరంగా ఉండడంతో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఊహించలేని విషయంగా మారింది.
అయితే పార్టీల గెలుపోటములను పక్కన పెడితే.బరిలో నిలిచే అభ్యర్థుల మద్య పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్.( CM kcr ) అయితే కేసిఆర్ కు పోటీగా బిజెపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతారని మొదటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈటెల కూడా కేసిఆర్ ను ఢీ కొట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే వచ్చారు.
ఇక ఇటీవల ప్రకటించిన మొదటి జాబితాలో ఈటెల రాజేందర్( Etela Rajender ) గజ్వేల్ నుంచి బరిలో దిగబోతున్నారనే కన్ఫర్మ్ అయింది.గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ నుంచి కూడా ఆయన పోటీ చేయనున్నారు.అయితే గజ్వేల్ బరిలో కేసిఆర్ ను ఢీ కొట్టి ఈటెల సత్తా చాటుతారా ? అసలు ఈటెల గెలుపు సాధ్యమేనా ? అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అనే సమాధానలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఈటెల రాజేందర్ కూడా మంచి ప్రదధారణ కలిగిన నేత.దానికి తోడు గతంలో బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న ఈటెల కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారు.పార్టీ విజయాల్లో ఈటెల పాత్ర కూడా ఎక్కువే.
అందుకే ఈటెల రాజేందర్( Etela Rajender ) ను బిఆర్‌ఎస్ బలమైన ప్రత్యర్థిగానే భావిస్తోంది.తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్ తరువాత.చతురత ప్రదర్శించే నేతల్లో ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉంటారు.
గత కొన్నాళ్లుగా గజ్వేల్ లో కేసిఆర్ అసంతృప్త వాదులను తన వైపు తిప్పుకోవడం, మెల్లగా తన పరిధిని పెంచుకోవడం వంటివి చేస్తూ వచ్చారు ఈటెల రాజేందర్.ఇటీవల గజ్వేల్ లోని కొంతమంది బిఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే ఈటెలకు మద్దతు తెలిపారు కూడా.
ఈ పరినమలన్నీ చూస్తే ఈసారి గజ్వేల్ ( Gajwel )లో కేసిఆర్ కు ఈటెల ద్వారా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.గజ్వేల్ బరిలో ఈటెల ఓడిపోయిన పెద్దగా పోయేదేమీ లేదు.
కానీ ఈటెల కేసిఆర్ పై గెలిస్తే అది సంచలనం అవుతుంది.; తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం అవుతుంది.
మరి కేసిఆర్ తో ఈటెల గెలిచి నిలిస్తారేమో చూడాలి.