కోలీవుడ్ పాన్ ఇండియా హీరో కేజిఎఫ్ నటుడు యష్( Hero Yash ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యష్ వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కేజిఎఫ్( KGF ).
కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు యష్.ఈ సినిమా తర్వాత యష్ రేంజ్ మారిపోయింది.పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు.అయితే ఒక లేడీ డైరెక్టర్ సినిమాను ఓకే చేశాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
కానీ, దాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఈ సినిమా తర్వాత ఈ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ( Nitesh Tiwari ) రామాయణం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రామాయణ గాధతో ఆదిపురుష్ రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో ఈసారి ఎలాగైనా రామాయణాన్ని( Ramayanam ) ప్రజలకు అద్భుతంగా చూపించాలని నితీష్ మరో రామాయణ కథతో ప్రేక్షకులను మెప్పించడానికి పూనుకున్నాడు.ఇక ఈ రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా.సీతగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి( Sai Pallavi ) సెలెక్ట్ అయ్యింది.అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో రావణాసుడిగా( Ravanasurudu ) చిత్ర బృందం ఎంపిక చేసింది.

అయితే అందువల్ల సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం కన్నడ హీరో భారీగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు రూ.150 కోట్లు ఈ పాత్ర కోసం హీరో డిమాండ్ చేశాడట.తన మార్కెట్ ను బట్టి ఈ రేంజ్ లో డిమాండ్ చేసి ఉండవచ్చని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అయినా కూడా ఒక పాత్ర కోసం అంత డిమాండ్ చేయడం ఎక్కువ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
అయితే ఇందులో ఎంత నిజం అనేది తెలియాల్సి ఉంది.అంతేకాకుండా అసలు ఈ పాత్రలో యష్ నటిస్తున్నాడా లేదా అనే విషయం కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది.







