పాపం నాగ చైతన్య హీరోయిన్ ని పట్టించుకునే వారే లేరుగా...

టాలీవుడ్

 లో గత సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైనటువంటి మజిలీ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ చిత్రంలో హీరోగా

అక్కినేని  నాగచైతన్య

నటించగా  సమంత అక్కినేని, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటించారు.

 Divyansha Kaushik, Tollywood Actress Divyansha Kaushik News, Divyansha Kaushik M-TeluguStop.com

ఈ చిత్రానికి టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా సాహు గరిపాటి నిర్మాతగా వ్యవహరించాడు.

అయితే ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్రలో నటించినటువంటి

దివ్యాంశ కౌశిక్

తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

తన అందం అభినయంతో కుర్రకారు మదులు గెలుచుకుంది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినప్పటికీ దివ్యాంశ కౌశిక్ మాత్రం అవకాశాలను దక్కించుకోలేక పోతోంది.అంతేగాక ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటికీ దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో నటించిన తర్వాత ఇప్పటి వరకు మరో కొత్త చిత్రానికి  సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం లేదు.

Telugu Majilidivyansha-Movie

దీంతో దివ్యంశ కౌశిక్ కి ఏమైందా అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు.అయితే సరిగ్గా ఇలాంటి పరిస్థితి

నాచురల్ స్టార్ నాని

నటించినటువంటి

జెర్సీ

చిత్రంలో హీరోయిన్ గా నటించిన

శ్రద్ధా శ్రీనాథ్

కూడా ఎదుర్కొంటోంది.అయితే ఇటీవల కాలంలో శ్రద్ధాశ్రీనాథ్ ఎట్టకేలకు గుంటూరు టాకీస్ చిత్రంలో హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ఓ చిత్రంలో మూడవ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube