విడాకుల కి సిద్ధమైన మాజీ హీరోయిన్

మొన్నటివరకు అమలాపాల్ తన భర్తకు విడాకులు ఇస్తుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

ఆ విషయం మర్చిపోక ముందే మరో నటి అమలాపాల్ బాట పట్టింది.

ఆమె ఎవరో కాదు మళయాళి నటి, డాన్సర్ అయిన దివ్య ఉన్ని.ఆమె తన భర్త డాక్టర్ సుధీర్ సుధాకరన్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది.

వారి వివాహం అయ్యి దాదాపుగా 14 సంవత్సరాలు అయ్యింది.ఇప్పుడు విడాకులు తీసుకోవటం మలయాళ చిత్ర సీమలో హాట్ టాపిక్ గా మారింది.

దివ్య కూడా వివాహం అయ్యాక అమలాపాల్ వలే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.అయితే ఇప్పుడు ఆమెకు ఇష్టమైన డాన్స్ స్కూల్ పెట్టటం ఆమె భర్తకు ఇష్టం లేదట.

Advertisement

కెరీర్ అంటూ కుటుంబాన్ని పట్టించుకోవటం మానేస్తుందని, ఇంట్లోనే ఉండమని భర్త ఆదేశించాడట.దివ్య డాన్స్ స్కూల్ మూసేయటం కుదరదని చెప్పటంతో ఇద్దరూ ఇగోలకు పోయి విడాకుల దాకా వెళ్లారు.

ఇరువైపుల పెద్దలు చేసిన రాజీ ఫలితాన్ని ఇవ్వలేదు.విడాకులకు అప్లై చేసారు.

దివ్య తన పిల్లలతో పుట్టింటికి వచ్చేసింది.ఆమె త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు