కింగ్ కి షాక్ ఇచ్చిన మేనల్లుడు

అక్కినేని కుటుంబం నుండి వచ్చిన సుశాంత్ మాటలకు కింగ్ నాగార్జున కొంచెం హార్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ యంగ్ హీరో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు కావొస్తున్నా కేవలం మూడు సినిమాలు మాత్రమే హీరోగా చేసాడు.

 Nagarjuna Got Shock With Sushanth Comments-TeluguStop.com

ఈ శుక్రవారం ఈ అక్కినేని యంగ్ హీరో నటించిన ‘ఆటాడుకుందాం రా’ ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ నేపథ్యంలో ఈ సినిమా విషయాలు చెప్తూ….

పనిలోపనిగా నాగార్జున గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

అక్కినేని కుటుంబం కలిసి నటించిన ‘మనం’ సినిమాలో అవకాశం రాకపోయినా, ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో నాగ చైతన్య,అఖిల్ నటించటం వలన ఆ లోటు తీరిందని చెప్పాడు.‘మనం’ సినిమాలో అవకాశం ఇవ్వకపోయినా సరే ఆ లోటు ఈ సినిమా ద్వారా తీరిందని సుశాంత్ నాగార్జునకు చురక అంటించాడు.ఈ సినిమాలో నటించేందుకు నాగ చైతన్యను నేను ఒప్పిస్తే, అఖిల్ ని మాత్రం మా అమ్మ ఒప్పించిందని చెప్పుకొచ్చాడు.

అంతేకాక తన తాత అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాస్’ సినిమాలోని పల్లెకు పోదాం పారును చూద్దాం అనే పాటలో ఒక బీట్ ని మాత్రమే రీమేక్ చేశామని చెప్పాడు.అలాగే ఈ సినిమా విజయం సాదిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు సుశాంత్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube