రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని స్వీప్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా మంగళవారం భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలో 5K రన్ జిల్లా కలెక్టర్ హనుమంత్ జె.జెండగి( District Collector Hanumanth J Zendagi ) జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) నమోదైన ఓటు శాతం కంటే ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో నమోదు కావాలని కోరారు.
జిల్లా యంత్రాంగం తరపున ఎన్నికలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, పౌరులు ఎన్నికల్లో ఫిర్యాదులు ఏమైనా ఉంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్,సి-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,విద్యార్థులు, పౌరులు పాల్గొన్నారు.