3న పల్స్ పోలియో చుక్కల పంపిణీ

ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో ఐదేండ్లలోపు పిల్లలు 44,770 రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ నెల ౩వ తేదీన ఆదివారం జిల్లాలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.వైద్య శాఖ అధికారులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో వాక్సిన్లు అందుబాటులో ఉంచారు.

జిల్లాలో మొత్తం 44,770 మంది ఐదేండ్ల లోపు పిల్లలు ఉన్నారు.394 కేంద్రాల్లో అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేండ్లలోపు పిల్లల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి, ఇందులో భాగంగా ఈ నెల ౩వ తేదీన (ఆదివారం) జిల్లాలో పోలియో చుక్కలు వేయనున్నారు.జిల్లాలో మొత్తం ఐదేండ్లలోపు పిల్లలు 44,770 మంది ఉన్నారు.

జిల్లాలో 2 సీహెచ్ సీ, 15 పీహెచ్ సీలు కలిపి మొత్తం 17 ఉండగా, 89 సబ్ సెంటర్లు ఉన్నాయి.వీటి పరిధిలో మొత్తం 394 పోలియో చుక్కల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేశారు.౩వ తేదీన పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన స్థలాల్లో పల్స్ పోలియో చుక్కలు పంపిణీ చేయనున్నారు.

అలాగే 25 మొబైల్ టీంలు అందుబాటులో ఉండనున్నాయి.అలాగే పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఉన్న ఇండ్లలోని పిల్లలకు, ఇంకా ఎవరైనా పిల్లలు మిగిలి ఉంటే వారికి 4,5 వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వేయనున్నారు పల్స్అ నురాగ్ జయంతి, కలెక్టర్ఐ దేండ్లలోపు వయసు ఉన్న పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి.

Advertisement

దగ్గరలోని కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News