అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వై ఎస్ ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 643 డ్వాక్రా సంఘాలకు 17 లక్షల 97 వేల 813 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా మహిళల పక్షాన నిలబడుతూ అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరున అమలు చేస్తున్నారన్నారు.
గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా అమలుచేయని ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం, కానీ సీఎం జగన్ మహిళా సంక్షేమం కోసం, మహిళా సాధికారత కోసం తన పాదయాత్రలో అక్క చెల్లెమ్మల కష్టం చూసి ఇచ్చిన హామీ నెరవేరుస్తూ డ్వాక్రా మహిళలకు ఆసరా ద్వారా రుణాలు మాఫీ చేయడం ,వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని అన్నారు.మహిళలందరి తరపునా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.
మహిళలందరూ కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో పాడేరు పంచాయితీ సర్పంచ్ కొట్టగుల్లి ఉషారాణి, పాడేరు ఎమ్.పి.పి శ్రీమతి శోనారి రత్న కుమారి గారు వైస్.ఎంపీపీ శ్రీమతి కుంతూరు కనకాలమ్మ గారు ఇతర ఎంపీటీసీలు సర్పంచులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు…