జగన్ కు మంట పుట్టిస్తున్న అసమ్మతి ?  ఫోన్ లో క్లాస్ ? 

ప్రభుత్వపరంగా దేశవ్యాప్తంగా తనకు పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయని , ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు వెళ్తుండడం తో పాటు,  దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఏపీని ప్రత్యేకంగా ప్రతి విషయంలోనూ నిలబెడుతున్న , పార్టీపరంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులు జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

అసలు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ,  పార్టీ ఆదేశాలను పాటిస్తూ వచ్చిన నాయకులు ఇప్పుడు తమ అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించడంతో పాటు,  పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ పదేపదే సొంత నేతలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం,  దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండటం,  ప్రత్యర్థులకు అవకాశం దక్కే విధంగా సొంత పార్టీలోని నాయకులు వ్యవహరిస్తున్న తీరు పై  చాలా కాలంగా వైసిపిలో చోటుచేసుకుంటున్నాయి.

అయినా ఎప్పటికప్పుడు జగన్ సర్డుకుపోతూనే వస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వ్యవహారం ముగిసిపోయింది.

పూర్తిగా జగన్ కరోనా కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టారు.  అయితే ఇదే సమయంలో పార్టీని సైతం చక్కదిద్దాలని , లేకపోతే రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే ఆలోచనకు వచ్చిన ఆయన నేరుగా పార్టీ రాజకీయ సలహాదారు లతో ప్రతి నియోజకవర్గం లోని కీలక నేతలు అందరికీ ఫోన్లు చేయిపిస్తూ, గట్టిగానే వార్నింగులు ఇస్తున్నారట.

  మీ పద్ధతి మార్చుకోవాలని , పార్టీ అభివృద్ధికి పాటుపడాలని,  వారితోనే చెప్పిస్తున్నారు అట.అయితే ఈ సందర్భంగా కొంతమంది నాయకులు పార్టీ సైతం లెక్క పెట్టనట్లు మాట్లాడుతుండటంతో నేరుగా జగన్ రంగంలోకి దిగాలని చూస్తున్నారట. గ్రూపు రాజకీయాలకు కారణమవుతూ,  పార్టీకి నష్టం చేస్తున్న నాయకుల జాబితా ఇప్పటికే తయారైందని , ఈ మేరకు జగన్ నేరుగా వారిని పిలిపించడం లేక,  ఫోన్ కాల్ ద్వారా వారికి గట్టిగా క్లాస్ పీకిస్తూ పార్టీ కోసం చిత్తశుద్ది తో పని చేయాలని వార్నింగ్ లు ఇప్పిస్తున్నారు అట.

Advertisement

 ముఖ్యంగా ఎమ్మెల్యేలు ,మంత్రులు , ఎంపీలు,  నియోజకవర్గ స్థాయి నాయకులు మధ్య ఏర్పడిన గ్రూపు రాజకీయాలపై దృష్టి పెట్టి పరిస్థితులను చక్కదిద్దాలని గట్టి వార్నింగ్ ఇవ్వడం ద్వారా సంకేతాలు ఇచ్చినట్లు అర్థం అవుతోంది.  పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడబోమని  సలహాదారులు ఇ .

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు