వాళ్లు 'అరుణ'ను వదిలిపెట్టరా?

అరుణ అనే అమ్మాయి కిడ్నాప్‌ అయిందని, వదిలిపెట్టడంలేదని అనుకుంటున్నారా? అదేం కాదు.చైనా పాలకులు మన దేశంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ను వదలిపెట్టడంలేదు.

వదిలిపెట్టడంలేదంటే ప్రస్తుతం వారు దాన్ని ఆక్రమించారని కాదు.అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనని వారి వాదన.

ఆ రాష్ర్టాన్ని వారి దేశంలో భాగమైనట్లు కూడా మ్యాపుల్లో చూపించుకుంటున్నారు.అరుణాచల్‌ చైనా సరిహద్దుల్లో ఉండటంతో దాన్ని ఆక్రమించుకునేందుకు వారు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

నెహ్రూ ప్రధానిగా ఉండగా యుద్ధం చేసి విస్తారమైన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.దానిపై ఇప్పటివరకూ చర్చలు సాగుతున్నాయిగాని ఒక్క అంగుళం భూమి కూడా భారత్‌కు రాలేదు.

Advertisement

భవిష్యత్తులో రాదు కూడా.ఇక అరుణాచల్‌ను కూడా కలిపేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు చైనా పాలకులు.

అప్పుడప్పుడు చైనా సైన్యం ఆ ప్రాంతంలోకి చొచ్చుకువస్తుంటుంది కూడా.ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు.

చైనాలో ఎవరు పర్యటించినా సరిహద్దు సమస్యపై చర్చలు తప్పనిసరి.కాని ఈసారి అరుణాచల్‌ పైనే ప్రధాన చర్చ జరగాలని చైనా డిమాండ్‌ చేస్తోంది.

ఇది చాలా పెద్ద సమస్యని చైనా పాలకులు చెబుతున్నారు.అరుణాచల్‌కు చైనాతో వెయ్యి కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
మరోసారి జనంలోకి జగన్.. కొత్త షెడ్యూల్ విడుదల..!!

ఈ రాష్ర్టం దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తోంది.ఈ ఏడాది పిబ్రవరిలో మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించినప్పుడు చైనా తీవ్ర నిరసన తెలిపింది.

Advertisement

మన పాలకులు చైనాకు బలంగా జవాబు ఇవ్వకపోతే, దాని ఆటలు అరికట్టకపోతే అరుణాచల్‌ను మింగేస్తుంది.

తాజా వార్తలు