డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ "9 అవర్స్" రియల్ టైమ్ థ్రిల్లర్ - షో రన్నర్ క్రిష్

ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న వెబ్ సిరీస్ “9అవర్స్”.డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ నుస్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.

 Disney Plus Hot Star 9 Hours Real Time Thriller , Show Runner Krrish , 9 Hour-TeluguStop.com

తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుషాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లోనటిస్తున్నారు.ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డివై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్,జెకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు.

పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈవెబ్ సిరీస్ జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.తాజాగా ఈ వెబ్సిరీస్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా

షో రన్నర్ క్రిష్ మాట్లాడుతూ…

టెలివిజన్ సీరియల్స్ నిర్మించడం ఖర్చుతో,శ్రమతో కూడిన పని.ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక ఒక మంచి కథను వెబ్ సిరీస్గా చూపించే వీలు దొరికింది.అందుకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వాళ్లకుకృతజ్ఞతలు చెబుతున్నా.మల్లాది గారి రచనలకు నేను అభిమానిని.మా నిర్మాణసంస్థ నుంచి ఆయన నవలలు కొన్ని రైట్స్ తీసుకున్నాం.ఇంకొన్నితీసుకోబోతున్నాం.

మల్లాది రచన నుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ 9 అవర్స్.రియల్ టైమ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది.

నా గమ్యం సినిమానుకన్నడలో చేసిన జాకోబ్ వర్గీస్, యాడ్ ఫిల్మ్ మేకర్ నిరంజన్ ఈ వెబ్ సిరీస్ను ఆసక్తికరంగా తెరకెక్కించారు.ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.అన్నారు.

హీరోయిన్ ప్రీతి అస్రానీ మాట్లాడుతూ

…9 అవర్స్ వెబ్ సిరీస్ లో నేనొకస్పెషల్ రోల్ చేశాను.ఇంత మంచి పాత్రను నాకు అందించిన క్రిష్ గారికిథాంక్స్.ప్రతి క్యారెక్టర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది.టెక్నికల్ గాసినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి.అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ…

గమ్యం సినిమా నుంచి క్రిష్ గారి సినిమాలోనటించాలని అనుకుంటున్నాను.ఆయన మంచి దర్శకుడు.

ఆయన ప్రాజెక్ట్ లో ఉండాలనిప్రతి ఒక్క నటుడు కోరుకుంటారు.ఈ వెబ్ సిరీస్ లో నాకు మంచి క్యారెక్టర్ఇచ్చారు.అన్నారు.

మధు షాలినీ మాట్లాడుతూ…

ఈ వెబ్ సిరీస్ లో నేను చిత్ర అనే జర్నలిస్ట్పాత్రలో నటిస్తున్నాను.క్రైమ్ థ్రిల్లర్ గా 9 అవర్స్ ఆకట్టుకుంటుంది.నేను ఈ కథలో క్రైమ్ సీన్ జరిగేప్పుడు అక్కడే ఉంటాను.వెబ్ సిరీస్ మొత్తంఒక వింటేజ్ ఫీల్ తో సాగుతుంది.ఈ కథా నేపథ్యానికి తగినట్లు నటించేందుకుప్రయత్నించాను.

క్రిష్ గారి సినిమాలు ఎంతో బాగుంటాయి.ఆయనతో పనిచేయాలనిఎప్పటినుంచో అనుకుంటున్నాను.

ఈ వెబ్ సిరీస్ లో నటించడం సంతోషంగా ఉంది.అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ…

9 అవర్స్ వెబ్ సిరీస్ లో నాకు బాగా నచ్చిన అంశంఇందులో ప్రతి క్యారెక్టర్ బాగుండటం.చాలా రోజుల తర్వాత సెట్ లో ఎంజాయ్చేశాను.

ఇద్దరు దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో పార్ట్ డైరెక్షన్ చేస్తూ మంచిఔట్ పుట్ ఇచ్చారు.బ్యాంక్ దొంగతనం అనేది దీంట్లో ఒక భాగం మాత్రమే.

కథలోఇంకా కొత్త విషయాలు ఉంటాయి.ఈ వెబ్ సిరీస్ ను కుటుంబమంతా కలిసి చూడొచ్చు.

క్రిష్ గారి ఆధ్వర్యంలో గుర్తుండిపోయే వెబ్ సిరీస్ చేయగలిగాం.అన్నారు.

ఈ కార్యక్రమంలో వెబ్ సిరీస్ కు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube