మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన డిస్కోరాజా విడుదలకు సిద్దం అవుతుంది.ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది.
నిన్న ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు ఇచ్చిన విషయం తెల్సిందే.ఇటీవలే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది.
ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇంకా విడుదల చేయలేదు.ఇక విడుదల చేస్తారనే నమ్మకం కూడా లేదు.
ఈ మద్య కాలంలో చిన్నా పెద్ద సినిమాలన్నింటికి కూడా ట్రైలర్‌లు విడుదల చేయడం చాలా కామన్ విషయం.కాని డిస్కోరాజా చిత్రానికి మాత్రం ట్రైలర్ విడుదల చేయకుండానే సినిమాను విడుదల చేస్తున్నారు.
డిస్కోరాజా రెండు టీజర్‌లను విడుదల చేశారు.ఆ రెండు టీజర్‌లతోనే సరిపెట్టారు.
ఇక హీరోయిన్స్ విషయంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి వీడియోలు విడుదల చేయడం లేదు.ప్రమోషన్ విషయంలో కూడా పెద్దగా హడావుడి కనిపించలేదు.

డిస్కోరాజా చిత్రం షూటింగ్ సమయం నుండే సినిమాపై అంచనాలు పెరిగేలా వార్తలు వచ్చాయి.విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను ప్రముఖ నిర్మాత తాళ్లూరి రామ్ నిర్మించాడు.రవితేజ నటించిన మొదటి సోషియో ఫాంటసీ చిత్రం అంటూ ప్రచారం చేస్తున్నారు.ట్రైలర్ విడుదల చేయకుండా కొత్త ట్రెండ్‌ను మొదలు పెట్టిన రవితేజకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.







