ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు రాజుకున్నాయి.ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశానికి ఇతర సంఘాలు గైర్హాజరు అయ్యాయి.
కాగా ఈ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలతో పాటు చట్టబద్ధతపై చర్చ జరిగింది.అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుపై కూడా ఉద్యోగులు చర్చించారు.
ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలకు సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానం పంపారు.అయితే విభేదాల కారణంగా పలు సంఘాలు సమావేశాలకు దూరంగా ఉన్నాయి.
దీంతో ఇతర సంఘాల తీరుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రస్థాయిలో మండిపడుతోంది.ఈ సంఘాలన్నీ ప్రభుత్వానికి అనుకూలమేమోనని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపణలు చేశారు.