టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లలో వి.వి.
వినాయక్ ఒకరు.ఆది సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన వినాయక్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాదించడంతో ఆ సినిమా తరువాత వరుస అవకాశాలు వచ్చాయి.
తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు హాజరైన వి.వి.వినాయక్ తన సినిమా కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన అఖిల్ సినిమా గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అఖిల్ సినిమా విడుదలైన తరువాత తనపై వినిపించిన నెగిటివ్ కామెంట్ల గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయని.
అందుకు ఏ వ్యక్తి మినహాయింపు కాదని అన్నారు.విమర్శలు చేసేవాళ్లు ప్రతి ఒక్కరినీ కామెంట్లు చేస్తూ విమర్శిస్తూనే ఉంటారని.వాళ్లకు అంతకు మించిన పని మరొకటి ఉండదని అన్నారు.అలాంటి పిచ్చోళ్లకు ఒక విషయం మాత్రం ఎప్పటికీ అర్థం కాదని చెప్పారు.
ఎవరూ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి సినిమాలు తీయరని.సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు పెట్టి అవతలి వ్యక్తులు బాధ పడే విధంగా ప్రవర్తించడం సరికాదని తెలిపారు.
అలాంటి పోస్టుల వల్ల ఎవరికీ లాభం ఉండదని.ఇతరులు బాధ పడేలా కామెంట్లు చేయడం సరికాదని అన్నారు.
వి.వి.వినాయక్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన అఖిల్ సినిమా 2015 సంవత్సరంలో విడుదలైంది.
భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది.45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయల షేర్ మాత్రమే సాధించింది.వినాయక్ ఎంచుకున్న కథ అఖిల్ కు సూట్ అయ్యే కథ కాదని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.
అఖిల్ తో స్నేహం వల్ల నితిన్ ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయి.