కిరణ్ అబ్బవరం తో సినిమా చేస్తున్న నాగార్జున డైరెక్టర్...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరో అయిన కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు… ఈయన ప్రస్తుతం రూల్స్ రంజన్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా విజయవంతం అయితే ఆయన నెక్స్ట్ ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

 Director Veeru Potla Planning A Movie With Hero Kiran Abbavaram Details, Kiran A-TeluguStop.com

ఇండస్ట్రీలో బిందాస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొన్న వీరు పొట్ల ఆ తర్వాత నాగార్జునతో రగడ అనే సినిమా చేసాడు ఈ సినిమాతో అవరేజ్ హిట్ అందుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత మంచు విష్ణుని హీరోగా పెట్టి దూసుకెళ్తా అనే సినిమా చేశాడు.ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు వీరు పోట్ల( Director Veeru Potla ) కి కూడా డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది.అయితే ఆ తర్వాత సునీల్ ని హీరోగా పెట్టి తీసిన ఈడు గోల్డ్ ఎహే సినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది.

 Director Veeru Potla Planning A Movie With Hero Kiran Abbavaram Details, Kiran A-TeluguStop.com

దాంతో ఈయన ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు.ఒకరిద్దరూ హీరోలతో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.ఇండస్ట్రీలో కొత్త సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు.

అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.అయితే ప్రస్తుతం రూల్స్ రంజన్ సినిమా( Rules Ranjan ) చేశాడు అది రిలీజ్ కి రెడీ గా ఉంది.అయితే రూల్స్ రంజన్ గనక హిట్ అయితే ఈ హిట్ తో నెక్స్ట్ వీరిపోట్ల డైరెక్షన్ లో సినిమా చేయడానికి కిరణ్ అబ్బావరం రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా అనేది విజయం సాధించడం అటు వీరుపోట్లకి చాలా అవసరం కాబట్టి వీరూపోట్ల కూడా ఒక మంచి కథతో వచ్చి మళ్లీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube