త్రివిక్రమ్ డైరెక్షన్ లో బాలయ్య మూవీ.. అలాంటి కథతో..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లలో సినిమా అంటే ప్రేక్షకుల్లో రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడతాయి.

అలాంటి కాంబినేషన్ లలో త్రివిక్రమ్ బాలకృష్ణ కాంబినేషన్ ఒకటి.

క్లాస్ సినిమాలకు ఎక్కువగా తెరకెక్కించే త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమాతో మాస్ సినిమాలను, ఫ్యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలను బాగా తెరకెక్కిస్తానని ప్రూవ్ చేసుకున్నారు.త్రివిక్రమ్ బాలకృష్ణ కాంబినేషన్ లో మూవీ రాబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, ఎన్టీఆర్ మూవీ పనులతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ భవిష్యత్తులో బాలకృష్ణ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ కాంబినేషన్ లో నిజంగా సినిమా తెరకెక్కుతుందో లేదో చెప్పడం సాధ్యం కాదు.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక మూవీలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో కూడా బాలయ్య నటించబోతున్నారు.

Advertisement

మే నెల నుంచి నందమూరి అబ్బాయ్ తో సినిమా తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ బాబాయ్ తో కూడా సినిమా తెరకెక్కిస్తారేమో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ బాలకృష్ణతో సినిమా తెరకెక్కిస్తే మాత్రం ఫ్యాక్షన్ కథతోనే తెరకెక్కిస్తారని సమాచారం.ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేని బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని భావిస్తున్నారు.

సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బోయపాటి శ్రీను బాలకృష్ణకు భారీ బ్లాక్ బస్టర్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు మొదట మోనార్క్ అనే టైటిల్ వినిపించగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీగా డిమాండ్ నెలకొందని సమాచారం.

అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి
Advertisement

తాజా వార్తలు