టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) గురించి చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసే డైరెక్టర్గా మంచి సక్సెస్ అయినటువంటి సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 ) షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు .
ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉండగా ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి అలాగే సినిమాల విషయంలో తాను చేసిన తప్పుల గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చి డిజాస్టర్ గా నిలిచినటువంటి సినిమాలలో జగడం ( Jagadam ) ఒకటి.రామ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా విషయంలో తాను పెద్ద తప్పు చేశానని సుకుమార్ ఓ సందర్భంలో తెలియజేశారు.ఆర్య సినిమా చాలా మంచి సక్సెస్ అయిన తర్వాత తాను దిల్ రాజు (Dil Raju) గారికి జగడం సినిమా కథ వినిపించాను అయితే ఆయన ఈ సినిమా విషయంలో నన్ను తప్పు పట్టడంతో తనకు చాలా కోపం వచ్చిందని ఆ సమయంలో తాను చాలా ఎమోషనల్ అయ్యానని తెలిపారు.

ఇలా దిల్ రాజు గారు నాపై కోప్పడడంతో పౌరుషాంగా నేను వెళ్లి ఈ సినిమా కథను హీరో రామ్ కిచెప్పి రాత్రికి రాత్రి ముహూర్తం ఫిక్స్ చేసి మరుసటి రోజు ఉదయం ఈ సినిమా పూజ కార్యక్రమాలను ప్రారంభించాము.ఇక ఈ కార్యక్రమానికి దిల్ రాజు అల్లు అర్జున్ ( Allu Arjun ) ముఖ్య అతిథులుగా ఆహ్వానించానని సుకుమార్ తెలిపారు.అయితే ఆ సమయంలో దిల్ రాజుగారు అసలు బుద్ధుందా చెప్పకుండా సినిమాని అనౌన్స్ చేస్తారా అంటూ తనపై కోప్పడ్డారు.నాది వీరత్వం అనుకున్నానని ఆర్య బ్లాక్ బస్టర్ కావడంతో నా జడ్జిమెంట్ తప్పని చెబితే కోపం వచ్చేదని సుకుమార్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో తమ్ముడి క్యారెక్టర్ లో రామ్ ను తీసుకొని హీరోలుగా బన్నీ లేదా మహేష్ బాబు( Mahesh Babu ) ని తీసుకొని ఉంటే బాగుండేది అంటూ దిల్ రాజుగారు చెప్పారు.ఈ సినిమా తనలో ఎంతో మార్పును తీసుకువచ్చిందని ఈ సందర్భంగా సుకుమార్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.