పెళ్లయిన ఆడోళ్ళు గృహహింస, వరకట్నం( Domestic violence, dowry ) వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటుంటారు.కట్నం కోసం భార్యను కడతేర్చే కిరాతకులు కూడా భారత దేశంలో ఉన్నారు.
ఇలాంటి వారికి న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు విధిస్తున్నా మిగతా వారికి బుద్ధి రావడం లేదు.తాజాగా మధ్యప్రదేశ్‌లో( Madhya Pradesh ) ఓ వ్యక్తి కట్నం తీసుకురాలేదని భార్యను నిర్దాక్షిణ్యంగా బావిలోకి తోసేశాడు.
ఈ ఘటనను వీడియో తీసి అతడు మరింత డబ్బు డిమాండ్ చేస్తూ వీడియోను ఆమె తల్లిదండ్రులకు పంపాడు.ఆ మహిళ తాడును పట్టుకుని ప్రాణాలతో బయటపడగలిగింది, అయితే ఆమెను పోలీసులు రక్షించారు.
సదరు క్రూరమైన భర్తను అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే.రాకేష్ కీర్ ( Rakesh Kier )అనే వ్యక్తి మూడేళ్ల క్రితం ఉషాకీర్‌ను( Ushakir ) వివాహం చేసుకున్నాడు.వారు నీముచ్ జిల్లాలోని కీరోన్ గ్రామంలో నివసించారు.
పెళ్లయినప్పటి నుంచి రాకేష్, అతని కుటుంబ సభ్యులు ఉష కుటుంబం నుంచి కట్నం డిమాండ్ చేస్తున్నారు.ఉష తల్లితండ్రులు అప్పటికే వారికి చాలా డబ్బు ఇచ్చినా రాకేష్ సంతృప్తి చెందలేదు.
ఇంకొక ఐదు లక్షలు తీసుకురావాలని భార్యని వేధించాడు.అందుకు నిరాకరించడంతో ఆగస్టు 21న రాకేష్ ఉషను బావిలోకి తోసాడు.
అదృష్టవశాత్తు ఆమె తాడును పట్టుకుని బతికింది, కానీ ఆమె రెండు గంటలపాటు బావిలో చిక్కుకుంది.ఈ ఘటనను చిత్రీకరించిన రాకేష్.రూ.5 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉష తల్లిదండ్రులకు వీడియో పంపాడు.

ఈ వీడియో చూసి ఉష తల్లిదండ్రులు షాక్ అయ్యారు.వెంటనే తేరుకొని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు రాకేష్ కీర్‌ను అరెస్టు చేసి వరకట్న వేధింపులు, దాడి, క్రిమినల్ బెదిరింపులు వంటి అభియోగాలు మోపి కేస్ ఫైల్ చేశారు.బావిలో పడి ఆర్తనాదాలు పెడుతున్న సదరు భార్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదొక దిగ్భ్రాంతికరమైన, ఆందోళన కలిగించే సంఘటన అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వరకట్న వేధింపులు, హింస చట్టవిరుద్ధమని హెచ్చరిస్తున్నారు.ఎవరైనా కట్నం కోసం వేధింపులకు గురైతే ప్రాణాలు పోకముందే దయచేసి పోలీసులకు ఫిర్యాదు చేయండని సలహా ఇస్తున్నారు.







