ఆర్య వంటి సినిమా ఉప్పెన .. వంద కోట్ల నమ్మకం పెట్టిన లెక్కల మాస్టర్‌

సుకుమార్ దర్శకత్వంలో మొదట వచ్చిన సినిమా ఆర్య.

ప్రేమ కథలకు కొత్త అర్థం ఇచ్చిన ఆర్య సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సుకుమార్‌ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్‌ దర్శకుడు అనడంలో సందేహం లేదు.

అద్బుతమైన కథ మరియు కథనాల ను తెలుగు ప్రేక్షకు ల ముందుకు తీసుకు వచ్చిన సుకుమార్‌ ఇప్పటి వరకు ఎంతో మంది శిష్యుల ను దర్శకులుగా పరిచయం చేసి సినిమాలను రూపొందించాడు.ఆ క్రమంలోనే సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సినిమా కు సుకుమార్‌ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.ఆ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమాపై తమకు ఉన్న నమ్మకంను చెప్పుకొచ్చారు.

Director Sukumar About Uppena Movie , Directror Sukumar, Uppena Movie, Vaishnav
Advertisement
Director Sukumar About Uppena Movie , Directror Sukumar, Uppena Movie, Vaishnav

సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు ఈ సినిమాను అత్యంత అద్బుతంగా తెరకెక్కించాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.సుకుమార్‌ దర్శకత్వం లో గతంలో వచ్చిన సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఆయన శిష్యడు ఉప్పెన సినిమాను తీశాడు అంటూ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న వారు కూడా అంటున్నారు.ఇక ఈ సినిమా గురించి సుకుమార్ మాట్లాడుతూ సినిమా కథ చెప్పిన సమయంలో ఖచ్చితంగా ఇది వంద కోట్ల సినిమా అనే నమ్మకం కలిగింది.

వెంటనే నిర్మాతలకు కాల్ చేసి చెప్పాను.ఇది ఖచ్చితంగా వంద కోట్లను రాబట్టే సినిమా అని నమ్మకంగా ఉన్న సుకుమార్‌ నిర్మాతలతో పట్టు బట్టి భారీగానే పెట్టించినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణ ను దగ్గరుండి పరిశీలించిన సుకుమార్‌ సక్సెస్‌ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు