టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకునిగా, కొరియోగ్రాఫర్ గా అమ్మ రాజశేఖర్ గుర్తింపును సొంతం చేసుకున్నారు.బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ గా కూడా అమ్మ రాజశేఖర్ పాపులర్ అయ్యారు.
కొన్నిరోజుల క్రితం హీరో నితిన్ కు డ్యాన్స్ రాదంటూ విమర్శలు చేయడం ద్వారా అమ్మ రాజశేఖర్ వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.అమ్మ రాజశేఖర్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ నాకు డైరెక్టర్ కావాలని కోరిక ఉండేదని ఆయన తెలిపారు.ఇంట్లో ఫ్రీగా ఉన్న సమయంలో కథ రాసుకునేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.
రణం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న తర్వాత ప్రభాస్ కు కథ చెప్పే అవకాశం దక్కిందని ఆయన తెలిపారు.అయితే ప్రభాస్ పిలిచిన సమయంలో వెళ్లకుండా తాను రెండు రోజులు ఆలస్యంగా వెళ్లానని ఆయన తెలిపారు.

తాను ఆలస్యంగా వెళ్లడం వల్ల ప్రభాస్ ను కలిసి కథ చెప్పే ఛాన్స్ దక్కలేదని ఆయన వెల్లడించారు.ఆ సమయంలో నితిన్ పాటకు డ్యాన్స్ మాస్టర్ గా చేసే ఛాన్స్ దక్కిందని ఆయన పేర్కొన్నారు.ఆ తర్వాత నితిన్ తో సినిమా తీసే అవకాశం దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.టక్కరి సమయంలో బీవీఎస్ రవి నా దగ్గర పని చేశాడని బీవీఎస్ రవి కథను నిర్మాతలకు చెప్పి ఒప్పించడంతో నా ఈగో హర్ట్ అయిందని ఆయన తెలిపారు.
ప్రభాస్ కు ఎవరేం చెప్పారో తెలియదని సినిమా ఛాన్స్ మాత్రం పోయిందని ఆయన అన్నారు.ప్రభాస్ ఇప్పటివరకు తన కథ వినలేదని పరోక్షంగా తన మొహం కూడా చూడలేదని అమ్మ రాజశేఖర్ తెలిపారు.
టక్కరి మూవీ ఫ్లాప్ కావడం వల్ల నా కెరీర్ పోయిందని ఆమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు.అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






