సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో ‘రోబో’ చిత్రం తర్వాత రాబోతున్న చిత్రం ‘2.ఓ’.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం రోబోకు సీక్వెల్‌గా చెబుతున్నారు.సౌత్‌లోనే సంచలన విజయాన్ని సాధించి, అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన రోబో కాంబోలో మూవీ అవ్వడంతో సహజంగానే సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.
దాదాపు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ‘2.ఓ’ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా కూడా విడుదల మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది.
దాదాపు సంవత్సర కాలంగా చిత్రాన్ని వాయిదా వేస్తూ వస్తున్న దర్శకుడు శంకర్ ఎట్టకేలకు నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.ప్రస్తుతం చివరి దశ విఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతుందని ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు ఆ వర్క్ పూర్తి అవ్వబోతుందని దర్శకుడు శంకర్ ప్రకటించాడు.
ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు, అక్షయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా మొదటి నుండి చెబుతూ వచ్చారు.
యాక్షన్ సీన్స్ గ్రాఫిక్స్ వర్క్‌కు చాలా ఆసల్యం అవుతూ వస్తుంది.

సంవత్సర కాలంగా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నా కూడా సినిమాకు చాలా కీలకం అయిన ఒక యాక్షన్ సీక్వెల్‌కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాలేదట.అది పూర్తి అవ్వాలంటే మరో ఆరు నెలల సమయం పట్టడంతో పాటు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉందట.దాంతో దర్శకుడు శంకర్ ఆ యాక్షన్ సీక్వెన్స్‌ను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.దాదాపు 10 నిమిషాల పాటు ఉండే ఆ యాక్షన్ సీన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు చాలా కష్టపడి చిత్రీకరణ జరిపారు.
అయితే సినిమాలో ఆ సీన్‌ను తొలగించడంతో అంతా కూడా నిరాశ చెందుతున్నారు.
దర్శకుడు శంకర్ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు.
కాని ఈసారి మాత్రం అనూహ్యంగా ఈ చిత్రంలోని ఆ యాక్షన్ సీన్స్‌కు కట్ చెప్పేస్తున్నాడు.ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని, శంకర్ సినిమా అంటే భారీ తనం ఆశిస్తాం, కాని ఆయన కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నాడు అనడంతో కాస్త నిరుత్సాహం వ్యక్తం అవుతుంది.
శంకర్ మరో వైపు కమల్ హాసన్‌తో ‘భారతీయుడు’ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు.అందుకే ఈ సినిమాను త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా అనిపిస్తోంది.