పిల్లని ఇచ్చిన అల్లుడు ఇంటికి వస్తే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అత్తా మామ.అల్లుడికి చిన్న కోపం రాకుండా ఎంతో గౌరవంగా చూస్తారు అయితే ఒక మామ మాత్రం తన అల్లుడు ఆషాడం రోజున ఇంటికి వస్తున్నాడనే కోపంతో ఏకంగా అల్లుడిని హత్య చేసేశాడు.
ఈ విషాదకరమైన ఘటన తూర్పు గోదావరిలో జరిగింది.వివరాలలోకి వెళ్తే.
భీమనపల్లి శివారు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్కిరాజు, తన అల్లుడైన ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడికి చెందిన అమలదాసు అయితే ఈ హత్యకి కారణం అతడు తన అత్తగారినికి ఆషాడ మాసంలో రావడమే.అయితే ఆషాడంలో రావద్దని పదే పదే హెచ్చరిస్తున్నా కూడా రావడంతో అతడి మామ కోపంతో 2015 జూలై 8న అల్లుడిని కోళ్లను కోసే కత్తితో నరికాడు…అయితే

ఈ హత్య జరిగిన సమయంలో హతుడి భార్య 9 నెలల గర్భవతి కూడా.అయితే అల్లుడిని తాను హత్య చేశాడని రుజువు కావడంతో మామ కు జీవిత ఖైదు, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు బుధవారం తీర్పు ఇచ్చారు.అయితే చిన్న చిన్న కోపాలని పెద్దవిగా చేసుకుంటూ ఎంతో మంది అన్నో అఘాయిత్యాలకి పాల్పడుతూ ఉంటారు ఇలాంటి వారికి ఈ సంఘటన ద్వారా అయినా మార్పు తెచ్చుకోవాలని న్యాయమూర్తి తెలిపారు.







