మసూద సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు తిరువీర్ .( Hero Thiruveer ) ఘాజీ, మల్లేశం, జార్జిరెడ్డి, ‘పలాస’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తిరువీర్.
మసూద’ సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు .ఇక ఇప్పుడు పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్ తో( Pareshan Movie ) అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్ సన్( Director Rupak Ronaldson ) దర్శకత్వం వహించారు.వాల్తేరు వీరయ్య ప్రొడక్షన్స్ బ్యానర్పై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో విపరీతమైన బజ్ ఏర్పడింది.
సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుండటం సినిమాకు ప్లస్ అయింది .మరి ఇన్ని అనుకూలతలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూ ఓ చూద్దాం
ముందుగా కధ విషయానికి వస్తే .ఒక్క మాటలతో చెప్పాలంటే ఇది సింగరేణి పోరగాళ్ళ కథ. మంచిర్యాల అనే ప్రాంతానికి సంబందించిన పోరగాళ్ల బయోపిక్ తీస్తే అదే పరేషాన్ అని చెప్పవచ్చు .సరిగ్గా చదువుకోకుండా .ఎలాంటి ఉద్యోగం చేయని హీరో .అనుకోకుండా ప్రేమలో పడతాడు .మరి ఆ ప్రేమలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి .అలాగే అతని జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి .వాటి వలన అతను పరేషాన్ అయ్యాడా .లేక ఎవరిని పరేషాన్ చేశాడు .చివరికి అతని ప్రేమ కధకు ఎలాంటి ముగింపు పడింది అనేది సినిమా కధ …

ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే .తెలంగాణ మాండలికంలో కామెడీతో రూపొందించిన సినిమాలు ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నాయి .జాతి రత్నాలు , మేము ఫెమస్ వంటివి ఆ కోవలనే హిట్ అయ్యాయి .ఇక ఈ పరేషాన్ కూడా తెలంగాణ పల్లెలో స్నేహితుల సరదాలతో సాగుతూ ఆకట్టుకుంటుంది .మధ్య తరగతి విద్యార్థి కి పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే .తండ్రి ఎలా ఉపన్యాసం ఇస్తారో చూపించిన విధానం నచ్చుతుంది .అలాగే తల్లి ఎలా చూసుకుంటుంది అనేది బాగా చూపించారు .స్నేహితులు , సరదాలు అన్ని నవ్వులు పంచుతూ ఆకట్టుకుంటాయి .

ఇక హీరో , హీరోయిన్ల ప్రేమ సన్నివేశాలని చక్కగా చూపించారు .ఓ మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ ఇవ్వడం బాగుంది.అలాగే ద్వితీయార్ధంలో కొంత ఎమోషనల్ గా సాగుతూ మెప్పిస్తుంది .ఒక సాధారణ కధకు కామెడీ , ఎమోషన్ జత చేసి ఆడియెన్స్ ని మెప్పించే ప్రయత్నం చాలావరకు అలరిస్తుంది…ఇక నటీనటుల విషయానికి వస్తే .మసూద సినిమాలో హీరోగా నటించి మెప్పించిన తిరువీర్ .ఈ సినిమాలోనూ చక్కని నటనని కనబరిచాడు .తెలంగాణ మాండలికంలో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు .అలాగే ఎమోషనల్ గాను ఆకట్టుకున్నాడు .

అలాగే హీరోయిన్ గా చేసిన పావని కరణం తన సహజ నటనతో అలరించింది , బన్నీ అభిరాం, సాయి ప్రసన్న తమ పాత్రలకు న్యాయం చేశారు .అర్జున్ కృష్ణ, శృతి రియాన్, రవి, రాజు వంటి వారు ఆకట్టుకున్నారు .మిగతా వారు పర్లేదు .ఇక సాంకేతిక విషయాలకు వస్తే .యశ్వంత్ నాగ్ సంగీతం ఆకట్టుకుంటుంది .వాసు ఫోటో గ్రఫీ బాగుంది .హరి శంకర్ , రూపక రొనాల్డ్సన్ ఎడిటింగ్ ఒకే అనిపిస్తుంది…మొత్తంగా చూస్తే .ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఒకసారి చూడొచ్చు .