ఆ సీన్ చేసేందుకు నమ్రత అనుమతి తీసుకున్న పూరి జగన్నాథ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సినిమా అంటే అన్ని రకాల నవరసాలతో ఉండటమే కాకుండా వాటిని ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించడమే సినిమా.వాటిని ఎన్నో సన్నివేశాలతో తెరకెక్కిస్తారు.

ఏ ఒక్క సన్నివేశం అయినా ప్రేక్షకులకు నచ్చకపోతే సినిమా మొత్తం ఫెయిల్ అయినట్లే.అందుకు దర్శక నిర్మాతలు ప్రతి ఒక్క సీన్ ను చిత్రీకరించే విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుంటారు.

అంతేకాకుండా రొమాంటిక్ సంబంధించిన సీన్స్ కూడా సినిమాలలో ఒక భాగమే.నిజానికి అన్ని సీన్ లలో నటీనటులు సులువుగా నటిస్తుంటారు.

కానీ రొమాంటిక్ సంబంధించిన సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడుతుంటారు.ముఖ్యంగా పెళ్లైన నటీనటులు మాత్రం రొమాంటిక్ సీన్స్ లలో నటించడానికి చాలా ఇబ్బందులు పడుతారు.

Advertisement

ఇక ఇప్పటికే చాలామంది పెళ్ళయిన హీరో హీరోయిన్స్ ఇటువంటి సన్నివేశాలలో నటించాలని దర్శకులు కోరితే చాలావరకు నిరాకరించారు.కొందరు దర్శకులు హీరో హీరోయిన్స్ ల భార్య భర్త లను బ్రతిమాలి మరి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి అనుమతి తీసుకుంటారు.

ఇదిలా ఉంటే గతంలో మహేష్ బాబు నటించిన ఓ సినిమా కోసం అందులో రొమాంటిక్ సీన్ చేసేందుకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ మహేష్ బాబు భార్య నమ్రత అనుమతి తీసుకున్నాడట.ఇక ఆ సినిమా ఏదో కాదు బిజినెస్ మాన్.

ఈ సినిమా 2012లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది.ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.ఆర్.వెంకట్ నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, మహేష్ బాబు నటీనటులుగా నటించారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఇందులో ఓ దగ్గర మహేష్ బాబు, కాజల్ కు మద్య ముద్దు సన్నివేశం ఉండగా ఈ సీన్ కోసం మహేష్ బాబు భార్య నమ్రత అనుమతి తీసుకున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్.అప్పటికే మహేష్ బాబు నమ్రత ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

పెళ్లి తర్వాత ఏ నటీనటుల కైనా రొమాంటిక్ సీన్స్ లలో నటించడం చాలా కష్టమే.

Advertisement

కానీ బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు, కాజల్ కి మధ్య కెమిస్ట్రీ కుదరడానికి ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాలని అనుకున్నాడు డైరెక్టర్ పూరి.ఇక ఈ సీన్ గురించి మహేష్ బాబుని అడగకుండా నేరుగా అతని భార్య నమ్రతనని అడిగాడు.గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి జగన్నాథ్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకోగా అందులో ముద్దు సీన్ గురించి కూడా తెలిపాడు.

ఈ సీన్ కొన్ని సెకన్ల పాటు ఉంటుందని ఇక ఈ సీన్ ను నమ్రత చూసి తన అంగీకారం తెలిపాకే ఆ సినిమాలో ఈ సీన్ పెట్టామని తెలిపాడు పూరి.ఇక ఈ సీన్ తో ఆ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యే విధంగా ఉంటుందని అందుకే అలా పెట్టడం జరిగింది అని తెలిపాడు.

తాజా వార్తలు