విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు క్రిష్ రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా హరి హర వీరమల్లు సినిమా ను మొదలు పెట్టాడు.ఆ సనిమా షూటింగ్ సగం కు పైగా పూర్తి అయింది.
కానీ ఎప్పటికి పూర్తి అయ్యేది మాత్రం క్లారిటీ రావడం లేదు.మరో మూడు నెలల్లో ఉన్న ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.
ఈ సమయంలో పవన్ సినిమా ల షూటింగ్స్ కు హాజరు అవ్వడం లేదు.పవన్ హాజరు అయ్యేది ఎప్పుడో అనే విషయం క్లారిటీ లేదు.

అందుకే పవన్ తో ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ను మొదలు పెట్టిన హరీష్ శంకర్( Harish Shankar ) కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు.ఇప్పటికే రవితేజ తో సినిమా కు ఓకే చెప్పించుకున్న హరీష్ శంకర్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా వీరి కాంబోలో సినిమా ఉంటుందట.మిరపకాయ్ తరహా లో ఓ రేంజ్ లో వినోదాన్ని అందించే సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక సాహో సుజీత్ కూడా పవన్ తో ఓజీ ని మొదలు పెట్టాడు.అది ఎప్పటికి పూర్తి అవుతుందో క్లారిటీ లేదు.అందుకే సుజీత్ కూడా కొత్త హీరో తో సినిమా కోసం ఏర్పాట్లు చేస్తున్నాడట.

ఈ సమయంలో క్రిష్ మాత్రం హరి హర వీరమల్లు( Hari hara veeramallu ) సినిమా ను పట్టుకుని వేలాడుతూ ఉండటం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.క్రిష్ వంటి ప్రతిభావంతుడు అయిన దర్శకుడు ఇలా సమయం ను వృదా చేయడం వల్ల ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ కూడా చాలా నష్టపోతుందని అంటున్నారు.ఆయన దర్శకత్వంలో నటించేందుకు చాలా మంది హీరోలు సిద్ధంగా ఉన్నారు.
కనుక కొత్త కథ తో సినిమా మొదలు పెట్టాలని క్రిష్ అభిమానులు కోరుకుంటున్నారు.