హరిహర వీరమల్లు కంటే ముందు మరో సినిమాతో దర్శకుడు క్రిష్‌

పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే దర్శకులకు చాలా సమయం వృధా అవుతుందని మరో సారి నిరూపితమైంది.గతంలో ఇద్దరు ముగ్గురు దర్శకులు ఏకంగా రెండు మూడు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేసి చేసి ఆశ వదులుకొని వేరే సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి.

 Director Krish Going To Do A Film Before Pawan Hari Hara Veeramallu Movie Releas-TeluguStop.com

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా ను మొదలు పెట్టిన దర్శకుడు పరిస్థితి కూడా అలాగే ఉంది.సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ వచ్చిన దర్శకుడు క్రిష్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకున్నాడో అప్పటి నుండి కూడా నిద్రపోతున్నట్లుగానే కెరియర్‌ లో ముందు సాగుతున్నాడు పాపం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పవన్ తో సినిమా ను కమిట్‌ అవ్వడం వల్ల క్రిష్ అన్ని విధాలుగా నష్ట పోతున్నాడు అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.హరిహర వీరమల్లు సినిమాకు ముందు కొండ పొలం అనే చిన్న సినిమా ను స్పీడ్ గా ముగించిన దర్శకుడు క్రిష్ అప్పటి నుండి కూడా హరిహర వీరమల్లు సినిమా పనిలోనే ఉన్నాడు.

Telugu Harihara, Kondapolam, Krish, Pawan Kalyan-Movie

దాదాపు రెండు సంవత్సరాలుగా ఆ పని లోనే ఉన్న క్రిష్ ఈ ఏడాది కూడా ఆ సినిమాను విడుదల చేసే పరిస్థితి కనపడటం లేదు.ఈ సంవత్సరంలో హరిహర వీరమల్లు సినిమా విడుదల ఉంటుందా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది.పవన్ కళ్యాణ్ వేరే సినిమాలకు డేట్లు ఇస్తున్న కారణంగా దర్శకుడు క్రిష్ కూడా కొండ పొలం తరహా లోనే మరో చిన్న సినిమా ను యంగ్ హీరో తో చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతుంది.

Telugu Harihara, Kondapolam, Krish, Pawan Kalyan-Movie

ఇటీవల ఆ యంగ్‌ హీరో తో చర్చలు జరిపినట్లుగా కూడా పుకార్లు షికారులు చేస్తున్నాయి.హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందే దర్శకుడు క్రిష్ వేరే హీరో తో సినిమా చేయడం అనేది కచ్చితంగా అవాస్తవం అయి ఉంటుంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో తో సినిమా చేస్తూ, ఆ సినిమా ను పక్కన పెట్టి చిన్న హీరో తో సినిమా చేయాల్సిన అవసరం ఏ ఒక్క దర్శకుడికి లేదు అనేది చాలా మంది అభిప్రాయం.

కనుక క్రిష్ గురించి జరుగుతున్న ప్రచారం అవాస్తవం అయ్యి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube