మెగాస్టార్ చిరంజీవి మొన్న సంక్రాంతి కి వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా విజయం తర్వాత చిరంజీవి వెంటనే తదుపరి సినిమా ను చేయాలని భావించాడు.
ఈ వేసవి కానుకగా తన తదుపరి సినిమా భోళా శంకర్ విడుదల చేసే విధంగా ప్లాన్ చేశాడు.కానీ దర్శకుడు మెహర్ రమేష్ కారణంగా చిత్రీకరణ ఆలస్యం అవుతోందట.
ఇప్పటికే పలు సార్లు రీ షూట్ కి వెళ్ళిన దర్శకుడు మెహర్ రమేష్ ఆగస్టు నెలలో సినిమా ను విడుదల చేసే విధంగా షూటింగ్ ని ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు నెలలో సినిమా ను విడుదల చేసే విధంగా చిత్రీకరణ ముగించాలని దర్శకుడు మెహర్ రమేష్ కి డెడ్ లైన్ పెట్టాడట.
ఒకవేళ ఆ లోపు చిత్రీకరణ పూర్తి చేయలేక పోతే కచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

చిరంజీవి మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా లో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక చిరంజీవి కి సోదరి పాత్ర లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించబోతోంది.ఈ ఇద్దరు ముద్దుగుమ్మల కారణంగా సినిమా కి మంచి హైప్ క్రియేట్ అయింది.
అలాగే చిరంజీవి గత చిత్రం భారీ విజయాన్ని నమోదు చేయడం వల్ల కూడా ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు.
ఈ సినిమా లో బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించబోతుంది.చిరంజీవి, శ్రీముఖి మధ్య ఖుషి సినిమా లోని నడుము సన్నివేశం ఉంటుందట.ఆ సన్నివేశం సినిమా కు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.







