మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఎవరో మన అందరికి తెలుసు.
డైరెక్టర్ బాబీ కొల్లి (Director Bobby).ఈయనే మెగాస్టార్ ను రెండు దశాబ్దాల ముందు ఎలా ఉన్నాడో చూపించి మెప్పించాడు.
అయితే డైరెక్టర్ బాబీ కొల్లి ఈ సినిమా తర్వాత మరో సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు.
వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా ఈయన ఇంత వరకు మరో సినిమా ప్రకటించలేదని.
ఈయన ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ మధ్యలోనే రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి.తాజాగా ఈయన నెక్స్ట్ సినిమాపై క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.బాబీ నెక్స్ట్ సినిమాను ఒక బిగ్ స్టార్ తో చేయబోతున్నాడు అంటూ సెన్సేషనల్ బజ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

బాబీ కొల్లి నెక్స్ట్ సినిమాను ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేయబోతున్నాడు అనే రూమర్ ఇప్పుడు క్రేజీగా మారింది.మహేష్ తో కలిసి పని చేయాలనీ బాబీ ఇటీవలే ఆయనతో చర్చలు స్టార్ట్ చేసినట్టు టాక్.ఇప్పటికే స్క్రిప్ట్ ను కూడా మహేష్ కు వినిపించినట్టు తెలుస్తుంది.మహేష్ స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

అయితే రాజమౌళి (SS Rajamouli) తో సినిమా ఎన్నాళ్ళ సమయం పడుతుందో చెప్పలేని విషయం.అందుకే ఈ సినిమా కంటే ముందుగానే మహేష్ మరో ప్రాజెక్ట్ ను ప్రకటించే అవకాశమే లేదు.ప్రజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా (SSMB28) చేస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే షూట్ స్టార్ట్ అయ్యింది.ఇది పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఈయన రాజమౌళితో సినిమా (SSMB29) చేయబోతున్నాడు.







