స్టార్ హీరో బాలయ్య 2001 సంవత్సరం ముందు వరకు భారీ స్థాయిలో విజయాలను అందుకున్నారనే సంగతి తెలిసిందే.2001 సంవత్సరం తర్వాత బాలయ్య సక్సెస్ రేట్ తగ్గింది.లక్ష్మీ నరసింహ, సింహా, లెజెండ్, అఖండ సినిమాలు మాత్రం గత రెండు దశాబ్దాలలో బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.బాలయ్య సినిమాలలో చెప్పే డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారనే సంగతి తెలిసిందే.
అన్ స్టాపబుల్ షో ద్వారా టాక్ షోలకు హోస్ట్ గా తాను పర్ఫెక్ట్ అని బాలయ్య ప్రూవ్ చేసుకున్నారు.అయితే నిజ జీవితంలో బాలయ్య మాట్లాడే సమయంలో కొన్నిసార్లు తడబడతారు.
బాలయ్య మాట్లాడే సమయంలో తడబడటం గురించి కొన్నిసార్లు ట్రోల్స్ కూడా వచ్చాయనే సంగతి తెలిసిందే.ప్రముఖ దర్శకులలో ఒకరైన ఏఎస్ రవికుమార్ చౌదరి స్టార్ హీరో బాలయ్యను అభిమానించే అభిమానులలో ఒకరు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవికుమార్ చౌదరి మాట్లాడుతూ కొన్ని సినిమాలకు అడ్వాన్స్ తీసుకొని తిరిగి ఇచ్చేశానని వెల్లడించారు.
బాలయ్య స్పీచ్ గురించి రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఊళ్లలో పెద్దపెద్ద లీడర్లను తీసుకుంటే, పెద్దపెద్ద శాస్త్రవేత్తలను తీసుకుంటే కొందరు అద్భుతంగా మాట్లాడలేకపోయినా గొప్పవాళ్లు అయ్యారని ఆయన వెల్లడించారు.సినిమా రంగంలో అద్భుతంగా కథ చెప్పే డైరెక్టర్ ఒకరు సినిమాలు బాగా తీయలేరని రవికుమార్ చౌదరి అన్నారు.
మరో డైరెక్టర్ కు మాత్రం కథ చెప్పడం అస్సలు రాదని అయితే ఆయన సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడిన రోజులు కూడా ఉన్నాయని రవికుమార్ చౌదరి చెప్పుకొచ్చారు.భావాన్ని వ్యక్తపరచడంలో చిన్నచిన్న తప్పులు ఉంటే దానిని తప్పు అనడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు.మాటల కంటే చేతలు ముఖ్యమని ఆయన కామెంట్లు చేశారు.
బాలయ్య 100 మాటలు మాట్లాడే కంటే మంచి పనులు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.విశ్వనాథ సత్యనారాయణ పరీక్ష ముందు రోజు చదవకుండా నిద్రపోతే వాళ్ల నాన్న తిట్టాడని కానీ ఆయనే స్కూల్ ఫస్ట్ వచ్చేవారని రవికుమార్ చౌదరి పేర్కొన్నారు.