పవన్ సాయితేజ్ కాంబో మూవీలో శ్రీలీల.. ఆమె దశ మారిపోయిందిగా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Director And Producers Planning A Special Song In Pawan Kalyan And Sai Dharam Te-TeluguStop.com

ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటూనే మరోవైపు వరసగా సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా షూటింగ్ కి కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు.

Telugu Ketika Sharma, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakani, Sree Leela, T

ఆ తరువాత సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో కూడా మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.కాగా ఇటీవల నటుడు దర్శకుడు అయిన సముద్రఖని దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రారంభించారు పవన్.ఇందులో పవన్ కళ్యాణ్ అలాగే అల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో నటించనుండగా సాయి సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించనుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం రీమేక్‏గా రాబోతున్న ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులు డేట్స్ ఇచ్చారట.అంతేకాదు గోపాల గోపాల తర్వాత మరోసారి ఇందులో దేవుడిగా కనిపించనున్నారు పవన్.

Telugu Ketika Sharma, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakani, Sree Leela, T

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్.మాతృక చిత్రంలో అసలు ఒక్క సాంగ్ కూడా లేదు.కానీ పవర్ స్టార్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ కొన్ని అంశాలను కోరుకుంటారు అభిమానులు.దాంతో ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పెట్టాలని భావిస్తున్నారట మేకర్స్.అయితే ఈ పాట కోసం టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలను ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా ఇటీవలే ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తదుపరి చిత్రాల విషయంలో అచితూచి అడుగులు వేస్తోంది.మరీ పవన్ సరసన స్పెషల్ సాంగ్ చేసేందుకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?లేదా ? అనేది చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube