సూర్య భార్య జ్యోతికలో ఉన్న ఈ టాలెంట్ గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే!

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలలో హీరోయిన్లు హీరోల మాదిరిగానే ఫైట్స్ చేయడం అలాగే జిమ్ లో హీరోలు మాదిరిగా పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ కసరత్తులు చేయడం లాంటివి చేస్తున్నారు.అయితే చాలా వరకు హీరోయిన్లు ఇలా ఫైట్ సీన్లను కెరియర్ ప్రారంభ దశలో నేర్చుకున్నప్పటికీ కేవలం అవి ఆ సినిమాలోని ఆ పాత్రలు అందుకు తగ్గ పరిస్థితులను బట్టి ప్రదర్శిస్తూ ఉంటారు.

 Jyothika Karra Samu Video Viral , Jyothika, Karra Samu,social Media ,heroine Jyo-TeluguStop.com

అలా తాజాగా హీరోయిన్ జ్యోతిక కర్రసాము చేసి అందరిని అవాక్కయ్యేలా చేసింది.హీరోయిన్ జ్యోతిక గురించి మన అందరికీ తెలిసిందే.

స్టార్ హీరో సూర్య భార్య అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.

ఒకప్పటీ సీనియర్ హీరోయిన్ నగ్మ చెల్లెలుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక హీరోయిన్గా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.కాగా సూర్య, జ్యోతిక లకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం తెలిసిందే.ఇకపోతే ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన జ్యోతిక వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.

ఈమెకు సోషల్ మీడియాలో భారీగా పాపులారిటీ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.కాగా జ్యోతిక యాక్టింగ్ లోనే కాకుండా అన్నీ విషయాల్లో తోపు అని నిరూపించుకుంటోంది.

అందుకు సంబంధించిన ఓ వీడియోనే ఇప్పుడు వైరల్ అయింది.ఆ వీడియోలో ఉన్న జ్యోతిక స్టేజ్ పైనే కర్ర సాము చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.2020 లో JFW మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇదంతా జరిగింది.అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆ వీడియోని చూసి జ్యోతిక పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

ఆ వీడియోని చూసిన తెలుగు తమిళ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.ఇద్దరు పిల్లల తల్లయినా సరే మంచి ఈజ్ తో కర్రసాము చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube