యూట్యూబ్‌లో దిమాక్ ఖరాబ్ చేసిన సాంగ్!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

 Ismart Shankar, Dimaak Kharaab, Ram, Puri Jagannadh-TeluguStop.com

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పూరి తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు క్యూ కట్టారు.

ఇక ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది ఈ సినిమాలోని పాటలు.

ముఖ్యంగా ఈ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ ఊరమాస్ పాటకు ప్రేక్షకులు రెచ్చిపోయి ఎంజాయ్ చేశారు.కాగా ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఈ పాటకు యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ అదిరిపోయే సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్ అయ్యింది.ఈ సినిమా రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube