తెలుగు ఫిలిం చాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిర్మాత దిల్ రాజు గెలుపొందారు.టిఎఫ్.
సి.సి ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరిగింది.జరిగిన ఈ ఎన్నికలలో దిల్ రాజుకి పోటీగా మరో నిర్మాత సీ.కళ్యాణ్ పోటీ పడడం జరిగింది.అయితే ఈ ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ 25 కాగా దిల్ రాజు 31 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది.ప్రొడ్యూసర్ సెక్టార్ లో మొత్తం 12 స్థానాలలో ఏడింటిలో దిల్ రాజు ప్యానల్ గెలుపొందడం జరిగింది.
డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో రెండు ప్యానల్స్ నుంచి చెరో ఆరుగురు గెలుపును అందుకున్నారు.ఎగ్జిబిటర్ సెక్టార్ లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు దిల్ రాజుకి మద్దతు తెలిపే అవకాశం ఉంది.
స్టూడియో సెక్టార్ లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ కి చెందినవారే కావటం విశేషం.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది.ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.ఛాంబర్ లో మొత్తం 1600 మంది సభ్యులు ఉండగా.891 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రొడ్యూసర్ సెక్టార్ లో 1600 ఓట్లకు 891 ఓట్లు పోలయ్యాయి.
స్టూడియో సెక్టార్ లో 98 ఓట్లకు 68, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 597 ఓట్లకు 380 పోలయ్యాయి.దిల్ రాజు ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా గెలుపొందడంతో.ఫిలిం ఛాంబర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది.