భీమ్లా నాయక్‌ తో అల్లు, దిల్‌ మద్యవర్తిత్వం.. వర్కౌట్ అయ్యేనా?

సంక్రాంతికి వచ్చే సినిమాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతున్నాయి.సంక్రాంతికి వారం ముందుగా ఆర్ ఆర్ ఆర్‌ రాబోతుంది.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఈ సినిమా ను రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెల్సిందే.ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదల కు సిద్దం అయిన నేపథ్యంలో సంక్రాంతికి అప్పటికే ఫిక్స్ అయిన సినిమా ల పరిస్థితి ఏంటీ అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.

ఈ సమయంలో కొందరు సినిమా ప్రముఖులు పెద్దలు పోటీ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.రాధే శ్యామ్‌ సినిమా ను ఆపడం సాధ్యం కాదు.

ఎందుకంటే దేశ వ్యాప్తంగా హిందీ వర్షన్ ను విడుదల చేయడం కోసం 3500 థియేటర్లను బుక్ చేసి పెట్టారు.అందుకే ఆ సినిమా విడుదల ఆగదు.

Dil Raju And Allu Aravind Talking With Bheemla Nayak Release , News About Bheeml
Advertisement
Dil Raju And Allu Aravind Talking With Bheemla Nayak Release , News About Bheeml

ఇప్పుడు ఉన్నది కేవలం భీమ్లా నాయక్.ఖచ్చితంగా ఆర్ ఆర్‌ ఆర్‌ వసూళ్ల పై భీమ్లా నాయక్ ప్రభావం ఉంటుంది.అందుకే ఆ ప్రభావం తగ్గించడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ అండ్ టీమ్‌ ఖచ్చితంగా సంక్రాంతికి రావాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.కాని అల్లు అరవింద్‌ మరియు దిల్‌ రాజులు రంగంలోకి దిగి భీమ్లా నాయక్ ను ఆపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

భీమ్లా నాయక్‌ నిర్మాతలతో వీరిద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అందుకే వీరిద్దరు చెప్తే ఏమైనా వర్కౌట్‌ అవుతుందా అనేది చూడాలి.

భీమ్లా నాయక్‌ ఒక వేళ సినిమాను కనుక సంక్రాంతికి విడుదల చేయలేక పోతే ఖచ్చితంగా సమ్మర్‌ వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు.అందుకే సంక్రాంతికే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

భీమ్లా నాయక్‌ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు