మీ భోజనం మీరే తెచ్చుకోండి అంటూ ఎన్టీఆర్, భానుమతి లకు కండిషన్ పెట్టింది ఎవరు ?

ఇండస్ట్రీలో ఫైట్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు భానుమతి గారు, అలాగే ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా అంతకు మించిన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు ఎన్టీఆర్.వీరి ఇరువురు కలిసి ఎన్నో చిత్రాల్లో కలిసిన నటించారు.

 Differences Between Ntr And Bhanumathi Details, Bhanumathi,ntr, Director Bn Redd-TeluguStop.com

మల్లీశ్వరి, పల్నాటి యుద్ధం వంటి ఎన్నో చారిత్రాత్మకమైన మరియు సాంఘికమైన చిత్రాలు నటించి మంచి హిట్ పెయిర్ గా నిలిచారు.అయితే వీరి జీవనశైలి, ఆహార నియమాలు, కట్టుబొట్టు అన్ని ఎంతో వ్యత్యాసమైన కలిసి నటించడం వల్ల గొప్ప జంట అనిపించుకున్నారు.

వీరిద్దరూ సెట్లో ఉంటే తేడా స్పష్టంగా కనిపించేది.వీరి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తుతం ఈ ఆర్టికల్లో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం.

అప్పట్లో చాలా మట్టుకు షూటింగ్స్ మొత్తం స్టూడియోలోనే కొనసాగేవి.స్టూడియోలోనే క్యాంటీన్ కూడా ఉండేవి.ఆ సినిమాలో నటించే నటీనటులకు భోజన ఏర్పాట్లు అక్కడే జరిగేది.కానీ ఎన్టీఆర్ భానుమతి లాంటి అగ్రశ్రేణి నటులు మంచి హోటల్స్ నుంచి భోజనం తెప్పించుకునేవారు.

ఎందుకంటే వారికి సరిపడా లేదా వారు ఇష్టంగా తినే భోజనం క్యాంటీన్లో రోజు దొరకదు.అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుంది ఆ భోజనం వీరు తినేవారు కాదు.

Telugu Bhanumathi, Canteen, Bn Reddy, Lunch, Ntr Bhanumathi, Tollywood-Movie

అందులో ముఖ్యంగా భానుమతి పూర్తి శాకాహారి పైగా మడి, ఆచారం వంటి విషయాలను బాగా ఫాలో అవుతూ ఉంటారు ఆవిడ ప్రతిరోజు మధ్యాహ్నం 12 అయ్యిందంటే చాలు టెన్షన్ గా భోజనానికి షూటింగ్ ఆపేసి మరి వెళ్ళిపోయేవారు.ఇక అన్నగారి వ్యవహార శైలి మరోలా ఉండేది ఆయన ఒంటి గంటకు మాత్రమే తినేవారు.భానుమతి తో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయంటే భానుమతి ముందు తన పిఏ 12 గంటలకు వచ్చి నిలబడేవారు.

Telugu Bhanumathi, Canteen, Bn Reddy, Lunch, Ntr Bhanumathi, Tollywood-Movie

దాంతో స్పాట్లోనే ఆమె షూటింగ్ ఆపేసేవారు కానీ అన్నగారికి ఆ విషయంలో కోపం వచ్చేది.ఒంటిగంటకు అందరూ వెళ్లిపోయినట్టుగా ఆమె కూడా వెళితే ఏం అవుతుంది అని అనేవారు.పైగా ఎన్టీఆర్ లాంటి నటుడు ముక్కలేనిదే తినేవారు కాదు, భానుమతికి మాత్రం బ్రాహ్మణ భోజనం కావాలి.

దాంతో వీరి ఇద్దరికీ క్యారేజ్ తెచ్చి ఆ బిల్లు నిర్మాతకు ఇచ్చేవారు.ఓ సారి బి ఎన్ రెడ్డి ఎన్టీఆర్ కి, భాను మతి కి మీ క్యారేజిలు మీరే తెచ్చుకోండి అంటూ నిబంధన పెట్టారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube