లైగర్ ఫస్ట్ ఛాయిస్ అనన్య కదా? ఆ హీరోయినా.. ఎందుకు రిజెక్ట్ చేసింది?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.

 Did You Know The First Heroine Choice Off Liger , Liger Movie , Puri Jagannath, Tollywood , Jhanvi Kapoor , Vijay Devarakonda ,ananya Pandey , Karan Johar,sridevi-TeluguStop.com

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా హీరోహిన్ చార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది.కాక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

 Did You Know The First Heroine Choice Off Liger , Liger Movie , Puri Jagannath, Tollywood , Jhanvi Kapoor , Vijay Devarakonda ,Ananya Pandey , Karan Johar,Sridevi-లైగర్ ఫస్ట్ ఛాయిస్ అనన్య కదా ఆ హీరోయినా.. ఎందుకు రిజెక్ట్ చేసింది-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

Telugu Ananya Pandey, Jhanvi Kapoor, Karan Johar, Liger, Puri Jagannath, Sridevi, Tollywood-Latest News - Telugu

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.లైగర్ సినిమాలో హీరోయిన్ అనన్య పాండేకి బదులుగా ముందుగా జాన్వి కపూర్ ని అనుకున్నారట.

ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.కానీ కొన్ని కారణాల వల్ల హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ పాత్ర చేయలేకపోయిందని తెలిపాడు.

ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.

Telugu Ananya Pandey, Jhanvi Kapoor, Karan Johar, Liger, Puri Jagannath, Sridevi, Tollywood-Latest News - Telugu

నేను శ్రీదేవి గారికి వీరాభిమానిని.అందువల్ల లైగర్ సినిమాలో జాన్వీ కపూర్ నీ తీసుకోవాలనుకున్నాము.కానీ జాన్వి కపూర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె సినిమాలో నటించలేకపోయింది.

అయితే నిర్మాత కరణ్ జోహార్ ఈ కథను విన్న తర్వాత బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరును సూచించడంతో ఆమెను ఎంపిక చేసుకున్నాం అని తెలిపాడు పూరి జగన్నాథ్.కాగా లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు చిత్ర బృందం అలాగే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube