లైగర్ ఫస్ట్ ఛాయిస్ అనన్య కదా? ఆ హీరోయినా.. ఎందుకు రిజెక్ట్ చేసింది?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా హీరోహిన్ చార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది.కాక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

కాగా లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.

"""/"/ ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.లైగర్ సినిమాలో హీరోయిన్ అనన్య పాండేకి బదులుగా ముందుగా జాన్వి కపూర్ ని అనుకున్నారట.

ఇదే విషయాన్ని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.కానీ కొన్ని కారణాల వల్ల హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ పాత్ర చేయలేకపోయిందని తెలిపాడు.

ఇంటర్వ్యూలో భాగంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ. """/"/ నేను శ్రీదేవి గారికి వీరాభిమానిని.

అందువల్ల లైగర్ సినిమాలో జాన్వీ కపూర్ నీ తీసుకోవాలనుకున్నాము.కానీ జాన్వి కపూర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె సినిమాలో నటించలేకపోయింది.

అయితే నిర్మాత కరణ్ జోహార్ ఈ కథను విన్న తర్వాత బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరును సూచించడంతో ఆమెను ఎంపిక చేసుకున్నాం అని తెలిపాడు పూరి జగన్నాథ్.

కాగా లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు చిత్ర బృందం అలాగే బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Air Coolers : అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు..!