ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ నిహారిక విడాకుల( Niharika Divorce ) వార్తలు సంచలనంగా మారాయి.నిహారిక పెళ్లయిన రెండు సంవత్సరాలకే తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు.
గత కొంతకాలంగా నిహారిక చైతన్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలో నిజమైన అంటూ నిహారిక కూడా అధికారికంగా తన విడాకుల విషయాన్ని ప్రకటించారు.
ఈ విధంగా నిహారిక సోషల్ మీడియా వేదికగా అధికారికంగా విడాకుల విషయాన్ని తెలియజేయడంతో ఒక్కసారిగా ఈమె గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక నిహారిక మామయ్య చిరంజీవి( Chiranjeevi ) ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో నిహారికను తమ ఇంటి కోడలుగా చేసుకోవడానికి చైతన్య తండ్రి ఇష్టపడ్డారు.దీంతో ఇరువురి కుటుంబ సభ్యులకు కూర్చుని పెళ్లి గురించి మాట్లాడి వెంటనే నిశ్చితార్థం అనంతరం వివాహం కూడా జరిగిపోయింది.ఇక వివాహం నిశ్చయమైన తర్వాత వెంకటచైతన్య వరుణ్ తేజ్ ( Varun Tej ) ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అయ్యారు.
అయితే ఒకానొక సమయంలో నిహారిక గురించి చైతన్య దగ్గర మాట్లాడుతూ తనతో కష్టమని జాగ్రత్తగా ఉండాలంటూ తనకు హెచ్చరించారట.

నిహారిక తన ఇంట్లో చాలా స్వేచ్ఛగా బ్రతికిన అమ్మాయి తన ఇష్ట ప్రకారమే ఇంట్లో వారందరూ కూడా నడుచుకునేవారు.అయితే తనపై ఉన్నటువంటి ప్రేమతో కుటుంబ సభ్యులు కూడా తన అల్లరిని తన గోలను భరించేవారు అయితే పెళ్లి తర్వాత ఆ అల్లరి గోల అంతా మీరే భరించాల్సి ఉంటుందని తనను భరించడం చాలా కష్టం అంటూ ముందుగానే వెంకట చైతన్యకు ( Venkata Chaitanya ) నిహారిక గురించి వరుణ్ అన్ని వివరించారట.ఇక నిహారిక వివాహమైన తర్వాత కొన్ని రోజులపాటు కుటుంబంతో ఎంతో మంచిగా ఉన్నప్పటికీ అనంతరం తన వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ లేకపోవడంతోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని, ఆ గొడవలే విడాకుల వరకు తెలుస్తుంది.