భాషతో సంబంధం లేకుండా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న హీరోయిన్లలో కియారా అద్వానీ( Kiara Advani ) ముందువరసలో ఉంటారు.ప్రస్తుతం గేమ్ ఛేంజర్( game changer ) సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్ముతున్నారు.
కియారా భర్త పేరు సిద్దార్థ్ మల్హోత్రా( Siddharth Malhotra ) కాగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కియారా సిద్దార్థ్ పెళ్లి గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.
కియారా అద్వానీ అత్తమ్మకు పానీ పూరి( Pani Puri ) అంటే ఎంతో ఇష్టం కావడంతో కియారా అద్వానీ అత్తపై ప్రేమతో పెళ్లిలో పానీపూరి స్టాల్ ఏర్పాటు చేశారు.
పానీపూరి పెట్టి అత్తను కియారా అద్వానీ బుట్టలో వేసుకున్నారు.పెళ్లి తర్వాత అత్తయ్య ఇంటికి వచ్చిన సమయంలో సైతం పానీపూరీ ఉండేలా కియారా జాగ్రత్తలు తీసుకున్నారు.అత్తగారిని ఎలా బుట్టలో వేసుకోవాలో కియారా అద్వానీని చూసి కొత్త కోడళ్లు నేర్చుకోవాలి.

మరోవైపు కియారా అద్వానీ గేమ్ ఛేంజర్ సినిమా కోసం 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారు.ఈ సినిమాలో కియారా రోల్ కొత్తగా ఉంటుందని ఈ సినిమాతో కియారా అద్వానీ ఖాతాలో మరో భారీ బ్లాక్ బస్టర్ చేరే ఛాన్స్ ఉంది.చరణ్, కియారా కాంబినేషన్ సీన్లు, సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తైంది.

త్వరలో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.గేమ్ ఛేంజర్ శంకర్, చరణ్ కెరీర్ లలో మెమరబుల్ సినిమాగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.దిల్ రాజు ఈ సినిమా కోసం డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు.
ఈ సినిమా ఫలితం ఒక విధంగా దిల్ రాజు కెరీర్ ను డిసైడ్ చేయనుంది.







