జాగింగ్ చేస్తున్నా మహిళను చూసి సింహం దాక్కుందా... వీడియో చూస్తే షాక్ అవుతారు....

సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.వాటిలో ముఖ్యంగా జంతువులు, పక్షులు, పాములకు సంబంధిచిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి.

 Did The Lion Hide After Seeing The Woman While Jogging You Will Be Shocked To Se-TeluguStop.com

అలాంటి వీడియోలనే నెటిజన్లు కూడా తెగ చూస్తుంటారు.ఇక కొన్ని వీడియోల్లో చిన్నాపిల్లల అల్లరి, యువతీ యువకుల హంగామా, వృద్ధులు చేసే సహాస విన్యాసాలు సైతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటాయి.

జంతువుల వీడియోల్లో ఎక్కువగా ఏనుగులు, పులి,సింహాలకు సంబంధించి వీడియోలు బాగా వైరల్‌ అవుతుంటాయి.అయితే ఇక్కడ అలాంటిదే మరో వీడియో షోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

 Did The Lion Hide After Seeing The Woman While Jogging You Will Be Shocked To Se-TeluguStop.com

వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.ఈ వీడియోలో అడవికి రాజైన మృగరాజు ఓ మహిళను చూసి భయంతో దాక్కున్నట్టుగా మనం చూస్తాం.ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియోలో ఒక సింహం వాకింగ్‌ చేస్తున్న మహిళను చూసి పొదల మాటున దాక్కుంది.ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఓ సింహం ఇంటి ముందు ఉన్న పొదల్లో కూర్చుని ఉంది.అదే సమయంలో ఒక మహిళ రోడ్డుపై జాగింగ్ చేస్తూ వచ్చింది.

అడవి జంతువులు మనుషులు కనిపిస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేటాడి చంపి తింటాయి.కానీ, అతి తక్కువ సందర్భాలలో మాత్రమే అడవి జంతువులు మనుషులను చూసి బెదిరిపోతాయి.

సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది.పొదల్లో దాక్కున్న ఆ సింహం జాగింగ్ చేస్తోన్న మహిళని చూసి భయపడిపోయిందో ఏమో తెలియదుగానీ, ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయింది.ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా షేర్‌ చేసిన ఈ వీడియోని నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు.ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుండి 41,000 కంటే ఎక్కువ మంది చూశారు.ఈ వీడియోను చూసిన నెటీజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఆమెను చూసి సింహమే భయపడిందంటే ఆమె మామూలు మహిళ కాదు అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube