ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఎంత కీలకమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏపీకి పోలవం ప్రాజెక్టు జీవనాడి లాంటిది.
ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి సంకల్పం ఈ ప్రాజెక్టు.అయితే ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా పోలవరం పూర్తి కావడంలేదు.
ప్రభుత్వాలు మారినా ఈ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు.రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు జలవనరుల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.
టీడీపీ హయాంలో దేవినేని ఉమ, వైసీపీ హయాంలో అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఈ శాఖ పనులను పర్యవేక్షించారు.
దేవినేని ఉమామహేశ్వరరావు హయాంలో అదిగో పోలవరం.
అదిగో పోలవరం అంటూ డెడ్‌లైన్లు మారుస్తూ వెళ్లారు.చివరకు ఆయన మంత్రిగా దిగిపోయారు.
అనిల్ కుమార్ యాదవ్ కూడా దేవినేని ఉమ తరహాలోనే చాలా డేట్లు ఇచ్చుకుంటూ వచ్చారు.అయితే అంబటి రాంబాబు వాళ్లిద్దరి తరహాలో కాకుండా పోలవరం ఇప్పట్లో పూర్తికాదని కుండబద్దలు కొట్టేశారు.
ప్రజల అటెన్షన్ ఈ ప్రాజెక్టు మీద లేకుండా నీరుగార్చేలా ఆయన మాట్లాడారు.పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తమకు కూడా తెలియదని స్పష్టం చేసేశారు.

అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు అన్నదే లేదని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ హయాంలో జరిగిన చారిత్రక తప్పిదం వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నదని ఆయన ఆరోపించారు.డయాఫ్రం వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బ తిన్నదో దానిపై చర్చ జరగాలని అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు.దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ సర్కారు లైట్ తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలవరం గురించి విపక్షాలు, మీడియా సహా ఎవరూ అడిగే పనిలేకుండా ఆయాసపడే ప్రసక్తే లేకుండా అంబటి రాంబాబు తెలివిగా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు కూడా వస్తున్నాయి.దీంతో పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేయదు.రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి పోలవరం అనే అతి పెద్ద కుంపటిని అంబటి దించేసుకున్నారని పలువురు భావిస్తున్నారు.