కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో మూడో స్థానంలో కొనసాగుతూ ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అంతగా సత్తా చాటలేక పోయింది.ఇదే అదునుగా బీజేపీ దూసుకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంలో పడింది.
దీంతో ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇక క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ట పరిచే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.అందుకే ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులకు వ్యవసాయ చట్టాల వల్ల కలిగే నష్టాలను వివరించడమే లక్ష్యంగా, అదే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ రైతులతో ముఖాముఖి అనే కార్యక్రమం, పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇలా వినూత్న కార్యక్రమాలను చేపట్టారు.
ఇక భట్టి విషయానికొస్తే రైతులతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలోని రైతులతో సమావేశం నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు రైతులకు చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరిస్తున్నారు.కాని ఇక్కడ అసలు మనం గమనించాల్సిన విషయం ఏమనగా రైతులు భట్టి విక్రమార్క మాటలను విశ్వసించారా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణను బట్టి నిర్ణయించబడుతుంది.
