యువత చాలా సాధారణంగా ధరించే దుస్తుల్లో షార్ట్ ఒకటి.ఇండిపెట్టున వున్నపుడు, బయట విహారయాత్రలకు వెళ్ళినపుడు దాదాపుగా అందరు ధరించే దుస్తులు టీషర్ట్, నిక్కరు.
షార్ట్ ( short )అనేది మార్కెట్లో ఎంత ధరకు దొరుకుతుంది… 200 రూపాయిలనుండి, మహాకాకపోతే 1000 రూపాయిల వరకు ఉంటాయి.అంతకంటే షార్ట్స్ కి ఎవరూ ఎక్కువ వెచ్చించరు.
అయితే మీకు ఇక్కడ ఫొటోలో కనబడుతున్న షార్ట్ కొనాలంటే మాత్రం అక్షరాలా 90 వేలు చెల్లించాల్సిందే!.

ఏంటి, షాక్ తింటున్నారా? మీరు విన్నది నిజమేనండి.ఎందుకంటే, అది సాధారణ బ్రాండ్ కాదు మరి.సెలెబ్రిటీలు( Celebrities ) ఎంతగానో వాడే అభిమానించే ఇటాలియన్ బ్రాండ్ లోరో పియానా( Loro Piana is an Italian brand ) ఇటీవల ఒక తెలుపు షార్ట్‌ని మార్కెట్లోకి తీసుకు వచ్చింది.ఇది చూడడానికి సాధారణ షార్ట్ లాగా కనిపించినా క్వాలిటీ మాత్రం దిమ్మ తిరిగే రేంజులో ఉంటుంది మరి.వాల్మర్ బెర్ముడా షార్ట్స్( Walmer Bermuda Shorts ) పేరిట రూపొందిన ఈ షార్ట్స్ ధర అక్షరాలా తొంభై వేల రూపాయలు.

దీనిని తయారు చేయడానికి 70 శాతం నూలు, ఫ్లాక్స్‌గా పిలిచే ప్రకృతి సిద్ధ ఫైబర్ దారాల వంటివి ఇందులో వాడడం జరిగింది.ఇక ఇది కావాలంటే మన ఇండియన్ మార్కెట్లో దొరకదు.అయితే ఆన్లైన్ మార్కెట్లో మాత్రం లభ్యమౌతుంది.uk.loropiana.com లో మీరు సదరు షార్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు.ఈ షార్ట్ వలన ఉపయోగాలు ఏమంటే, ఎండవేళ ఇలాంటి నూలు దుస్తులు ధరించడం వలన వడగాలి నుండి ఉపశమనం పొందవచ్చు.అందులోనూ మెత్తగా పల్చగా ఉండే మల్‌మల్ కాటన్ బట్టలు ఒంటికి ఎంత హాయిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ విషయం అందరికీ తెలిసిందే.ఫ్యాషన్ లేకుండా వీటిని వేసుకోవాలంటే అమ్మాయిలు ఒప్పుకోవడం కష్టం కదా.అందుకని దీనితో పాటు మెత్తటి మల్‌మల్ కాటన్ వస్త్రంతోనే గ్రాండ్‌గా కనిపించేలా గరారాను రూపొందించింది ప్రీవిన్ సంస్థ.