ఏపీలో ఎన్నికలకు కేవలం పది నెలలు మాత్రమే సమయం ఉంది.దాంతో రోజు రోజుకు ప్రధాన పార్టీల మద్య రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది.
ఈసారి టీడీపీకి( TDP ) ఎన్నికలు డూ ఆర్ డై కావడంతో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలు.రాజకీయంగా హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.
వైసీపీ( YCP ) ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ సభల్లోనూ, పర్యటనలలోనూ జగన్ ( JAGAn )పాలన వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల దృష్టిని టీడీపీ వైపు తిప్పుకునేలా చంద్రబాబు( Chandrababu ) గట్టిగానే వ్యూహరచన చేశారు.ఇప్పటికే అనుకూల మీడియా మరియు సోషల్ మీడియా పెద్ద ఎత్తున జగన్ కు వ్యతిరేకంగా పాలన వైఫల్యలపై కథనాలు ఇస్తూ వైసీపీని గట్టిగానే దెబ్బ తీస్తున్నాయి.

ఇదిలా ఉంచితే మరోరకంగా వైసీపీని దెబ్బ తీసేందుకు టీడీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.వైసీపీపై వ్యతిరేకత పెరుగుతోందని, ఆ పార్టీలోని నేతలు టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని ఇటీవల తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) శ్రేణులు ప్రతిసారి మీడియా సమావేశాల్లోనూ బహిరంగ సభల్లోనూ చెబుతున్నారు.ఏకంగా వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆ మద్య టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చెప్పడంతో ఇది టీడీపీ మైండ్ గేమా లేదా నిజమా అనే చర్చ జోరుగా సాగుతోంది.అయితే ఆ 40 మంది ఎమ్మేల్యేలు ఎవరో చెప్పాలంటూ వైసీపీ ఎద్దేవా చేస్తోంది.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో ఆ మద్య జరిగిన ఎమ్మెల్సీ క్రాస్ ఓటింగ్ ను గమనిస్తే అర్థం చేసుకోవచ్చు.ఆ రకంగా చూస్తే 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీ వైపు లాగిన ఆశ్చర్యం లేదనేది కొందరి మాట.ఇక ఇటీవల నెల్లూరు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి( MP Adala Prabhakar Reddy ) టీడీపీలో చేరబోతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి( Somireddy ) చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే తాను పార్టీ మారడం లేదని ఆదాల ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు.ఇలా వైసీపీ నేతలను టీడీపీ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు ఏపీ రాజకీయాలను గమనిస్తున్న అతివాదులు చెబుతున్నా మాట.మరి టీడీపీ మైండ్ గేమ్ తో వైసీపీకి షాక్ ఇస్తుందేమో చూడాలి.







