Niharika Niharika: ఆ విషయంలో నిహారిక చేసిన తప్పే సితార కూడా చేస్తోందా.. మహేష్ నమ్రత జాగ్రత్త పడతారా?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు వారి వారసులుగా తమ పిల్లలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు.ఇలా ఎంతోమంది సినీ వారసులు ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

 Did Sitara Doing Same Mistake As Niharika Do-TeluguStop.com

హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా హీరోయిన్స్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు కానీ మన సౌత్ సినిమాలలో మాత్రం సెలబ్రిటీల అమ్మాయిలు పెద్దగా సినిమాలలో నటించరు.నటించిన కూడా హీరోయిన్లుగా మాత్రం సక్సెస్ కాలేదని చెప్పాలి.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచు లక్ష్మి,( Manchu Lakshmi ) నిహారిక, జీవిత రాజశేఖర్ కూతుర్లు వంటి వారు మాత్రమే హీరోయిన్స్ గా వచ్చారు.అయితే వీరెవరు కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.

Telugu Mahesh Babu, Nagababu, Namratha, Sitara, Tollywood, Varun Tej-Movie

మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే చిరంజీవికి (Chiranjeevi) ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు.ఇక నాగబాబు (Nagababu ) కుమార్తె నిహారిక (Niharika) గురించి అందరికీ తెలిసిందే ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీలోకి వచ్చారు అనంతరం సినిమాలలో నటించారు.హీరోయిన్ గా నిహారిక కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు పెళ్లి చేశారు పెళ్లి అవ్వడంతో ఇండస్ట్రీకి ఈమె దూరమయ్యారు.

Telugu Mahesh Babu, Nagababu, Namratha, Sitara, Tollywood, Varun Tej-Movie

ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నిహారికకు ఉన్నఫలంగా పెళ్లి చేసి ఇండస్ట్రీకి దూరం పెట్టడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి ఈమె తరచూ తన భర్తతో గొడవపడేదని ఇలాంటి మనస్పర్ధలు అపార్థాల కారణంగా వీరిద్దరూ విడాకులు ( Divorce ) తీసుకొని విడిపోయారని తెలుస్తోంది.ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగాలి అని ప్రయత్నించిన నిహారిక మాత్రం సక్సెస్ కాలేకపోయింది అయితే ఈ ప్రభావం తన వ్యక్తిగత జీవితంపై కూడా పడి వ్యక్తిగతంగా కూడా ఆమె ప్రస్తుతం సంతోషంగా లేరని చెప్పాలి.ఈ క్రమంలోనే నిహారిక మాదిరిగానే మహేష్ బాబు కుమార్తె సితార( Sitara ) కూడా అడుగులు వేస్తున్నారు.

Telugu Mahesh Babu, Nagababu, Namratha, Sitara, Tollywood, Varun Tej-Movie

ఇంత చిన్న వయసులోనే సితార సినిమాల పట్ల ఎంతో ఇష్టాన్ని చూపుతుంది.ఆమె తప్పకుండా సినిమాలలోకి హీరోయిన్గా వస్తానని భావిస్తున్నారు.ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె ఇంటర్నేషనల్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది.

అయితే ఈమె కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చి సక్సెస్ అయితే పర్లేదు కానీ అలా కాకుండా ఉంటే మాత్రం తన కెరియర్ కూడా కాస్త ఇబ్బందులలో పడుతుందని కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.నిహారిక బాటలోనే సితార కూడా పయనిస్తుందని అయితే ఈమె ఇండస్ట్రీలో కష్టపడి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు ఇక మహేష్ బాబు( Mahesh Babu ) నమ్రత( Namratha ) కూడా సితార కెరియర్ పట్ల పక్క ప్లానింగ్ తో ఉన్నారని తన కెరీర్ కు ఎలాంటి డోకా లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారంటూ కూడా ఈ విషయంపై పలువురు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube