తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది.ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ ప్రచారాలకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే బీఆర్ఎస్ హుస్నాబాద్ వేదికగా తొలి ఎన్నికల సభ ఏర్పాటు చేసింది.
గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుస్నాబాద్ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించారు.
ఇవాళ్టి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 42 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ఆశీర్వాదంతో ఆనాడు 88 సీట్లు గెలిచామని చెప్పారు.
ఈ క్రమంలో మళ్లీ హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నామన్న కేసీఆర్ ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దన్నారు.ఓటు అనేది మన తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు.
స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.ప్రజల ఆశీస్సులతో 95 నుంచి 105 సీట్ల వరకు బీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.







