తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటుడు సినిమాల్లో అవకాశాల కోసం చాలా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలో వాళ్లకి అవకాశాలు వస్తే సంతోషం లేదంటే మాత్రం మళ్లీ ఇంకో కొత్త సినిమా కోసం వాళ్ల వేట మొదలు పెడుతూ ఉంటారు.
ఒకప్పుడు అలాంటి ఇబ్బందులు పడినవారు చాలామంది ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూన్నారు.
ఇప్పుడు స్టార్లు గా ఉన్న చాలామంది ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే అయితే తమిళ్ డైరెక్టర్,నటుడు అయిన సముద్ర ఖని( Samuthirakani ) కూడా ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొని మరి ఇండస్ట్రీ కి వచ్చి తినడానికి తిండి లేని రోజులను అనుభవించడం జరిగింది.ప్రస్తుతం ఆయన నటుడుగా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకెళ్తున్నాడు.ఇక ఈయన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) బ్రో అనే సినిమా చేశాడు ఈ సినిమా ఆవరేజ్ గా ఆడింది.
అయితే ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ తినడానికి తిండి కూడా లేని సమయంలో చాలా రోజులు పస్తులు పడుకొని మరి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూశాడు.
అలాగే ఒకరోజు ఒక సినిమా ఆడిషన్ కి వెళ్తే ఆయనకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేకపోతే వాళ్ళ రూంలో వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు వాడే చెప్పుల్ని వేసుకొని వెళ్ళాడు తిరిగి వచ్చిన తర్వాత ఆ రూమ్ లో ఉన్న ఒక అతను ఆ చెప్పులు వాష్ రూమ్ లోకి వాడేవి బయటికి ఎందుకు వేసుకెళ్లావ్ అని తిట్టడం జరిగింది.దాంతో ఆయన బాధపడిపోయి మొత్తానికి ఆకలి కష్టాలు,డబ్బుల ఇబ్బందులు లేకుండా ఉండే రోజు కోసం కష్టపడాలి అనుకొని చాలా కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పుడు ఇండస్ట్రీ లో డైరెక్టర్ ( Director )గా నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy