టీడీపీ రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) ముప్పుగా మరిందా ? ఆయన టీడీపీకి భయపడుతున్నారా ? ఇన్నాళ్ళు టీడీపీ ( TDP )విషయంలో సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడేందుకు ఆ పార్టీ పై స్పందిస్తున్నారు ? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ( Congress party )కీలక పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ తరుపున ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో టీడీపీని బలపరచడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా ఉందనేది అందరికీ తెలిసిన విషయం.ఇక చంద్రబాబు కారణంగానే రేవంత్ రెడ్డి రాజకీయంగా బలపడారనే వాదన కూడా వినిపిస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి టీడీపీ విషయంలోనూ చంద్రబాబు విషయంలోనూ ఎలా స్పందించిన రాజకీయంగా పలు చర్చలకు దారి తీస్తోంది.ఆ మద్య చంద్రబాబు( Chandrababu ) జైల్లో ఉన్న సమయంలో ఆచితూచి స్పందించిన రేవంత్ రెడ్డి.ఇటీవల జరిగిన ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీపై తనకున్న ప్రేమను భయటపెట్టారు.దీంతో టీడీపీ కాంగ్రెస్ మద్య రేవంత్ రెడ్డి వారధిలా పని చేస్తున్నారని, ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పటికి టీడీపీ తరుపున పని చేస్తున్నారని ఇలా రకరకాల అభిప్రాయాలూ వ్యక్తమౌతూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కారణంగా టీడీపీ ప్రభావం కాంగ్రెస్ పై కాంగ్రెస్ పై పడే అవకాశం ఉందని హస్తం నేతలు ఆందోళనలో ఉన్నారట.దాంతో ఇప్పుడు టీడీపీతో తనకు సంబంధం లేదని నిరూపించుకునే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి.టీడీపీతో తనకు సంబంధం లేదని, రాజకీయాల్లో చంద్రబాబు తనకు గురువు కాదని, తనకు తానే గురువు శిష్యుడనని చెప్పుయికొచ్చారు.ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే ఏపీలో టీడీపీకి ప్రత్యర్థిగా బరిలో దిగేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నానని చెప్పడంతో మరింత చర్చనీయాంశం అవుతోంది టీడీపీతో తనకున్న మరకను తొలగించుకునేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అందుకే సడన్ గా యూ టర్న్ తీసుకొని టీడీపీకి యాంటీగా మారుతున్నారనేది కొందరు చెబుతున్నా మాట.