మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram Charan ) చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా తన పేరును సుస్థిరం చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.దాంతో పాటుగా బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమాకి కమిట్ అయ్యాడు.
ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాల కథలను కూడా వింటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేస్తున్న వరుస సినిమాలు మంచి విజయాలను అందుకోవడం కూడా ఆయన స్టార్ హీరోగా మారడానికి ఒక కారణమనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ డైరెక్షన్ లో చేసిన నాయక్ సినిమాలో రెండు సీన్లను చూస్తే మనకు సింహాద్రి సినిమా ( Simhadri movie )నుంచి కాపీ చేసినట్టుగా అనిపిస్తుంది.అది ఏంటి అంటే నాయక్( Nayak ) ఇంటర్వెల్ సీన్ లో రౌడీని గుండెలో పొడిచి చంపేస్తాడు.
ఇక ఇదే సింహాద్రి లో కూడా భూమిక ఒక సడెన్ ట్విస్ట్ ఇస్తు ఎన్టీయార్ ను గుణపంతో గుండెల్లో గుచ్చుతుంది.ఇక అదే విధంగా నాయక్ సినిమాలో కూడా ఒక ట్విస్ట్ రివిల్ చేస్తూ నడుస్తుంది.
ఇక అలాగే సింహాద్రి సినిమాలో కేరళలో ఎన్టీఆర్ వల్ల అక్కని ఒకరు చంపితే ఆ చంపిన వాన్ని హీరో చంపి అక్కడ సింగమలై గా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.ఇక ఇక్కడ రామ్ చరణ్ వాళ్ళ బావ అయిన రాజీవ్ కనకాలని ఒకరు చంపితే తను కూడా వాళ్లని చంపి అక్కడ నాయక్ గా ఎదుగుతాడు.ఇలా ఈ రెండు సినిమాలకు మధ్య ఈ సీన్లలో కామన్ గా కనెక్షన్స్ అయితే ఉన్నాయి.అందుకే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాయక్ సినిమా మీద చాలా విమర్శలైతే వచ్చాయి.