విద్యార్థులు కష్టమైన గణిత సమస్యలను( Maths Problems ) పరిష్కరించడానికి ఏ రీతిలో కష్టపడతారో అందరికీ తెలిసిందే.కొన్ని లెక్కలకు సమాధానాలు దొరకగా విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారా.
అయితే గూగుల్ విద్యార్థుల గణిత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించడం కోసం ఫొటో మ్యాథ్స్ యాప్( Photomath App ) ను లాంచ్ చేసింది.ఇకపై ఏదైనా గణిత ప్రశ్నను ఒక ఫోటో తీస్తే చాలు క్షణాల్లో సమాధానం వస్తుంది.
గణితంలో కష్టమైన త్రికోణమితి లేదంటే బీజగణిత సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా ఈ యాప్ ద్వారా సమాధానాలు తెలుసుకోవచ్చు.ఫొటో మ్యాథ్స్ యాప్ ఒక స్మార్ట్ కెమెరా క్యాలిక్యులేటర్, మ్యాథ్స్ అసిస్టెంట్ యాప్.
గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.వినియోగదారులు మ్యాథ్స్ సమస్య యొక్క ఫోటో తీస్తే చాలు.
ఆ సమస్య పరిష్కారాన్ని దశలవారీగా వివరణ రూపంలో అందిస్తుంది.ఈ కొత్త యాప్ ఇంటిగ్రేషన్ తో, గూగుల్ తన ఎడ్యుకేషనల్ పోర్ట్ ఫోలియో ను విస్తరిస్తోంది.
ఈ యాప్ ద్వారా సులభంగా గణితం నేర్చుకోవడం, గణితానికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం తెలుసుకోవడం సాధ్యమవుతుంది.మరి ఈ యాప్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ( Google Play Store )లో, iOS పరికరాలలో app store లో ఈ ఫొటో మ్యాథ్స్ యాప్ కోరకు సెర్చ్ చేసి, యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.యాప్ తెరచి, అందులో ఉన్న కెమెరా సహాయంతో గణితం ప్రశ్నను కెమెరా తీయాలి.
లేదంటే మాన్యువల్ గా టైప్ చేయాలి.టైప్ చేయడానికి అంతర్నిర్మిత గణిత కీబోర్డ్( Maths Keyboard ) ను ఉపయోగించుకోవచ్చు.
ఇక క్షణాల్లో గణిత సమస్యను స్కాన్ చేసి సరైన పరిష్కారాన్ని అందిస్తుంది.
ఈ యాప్ బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, గణంకాలు, కాలిక్యులస్(Calculus ) లతో పాటు వివిధ గణిత సమస్యలను పరిష్కరించగలదు.వినియోగదారుల అవసరాల కోసం బహుళ భాషలను కూడా అందిస్తుంది.